Site icon NTV Telugu

Rajnath Singh: ‘‘పాలకు పిల్లి రక్షణ’’.. యూఎన్‌ వ్యవహారంపై ఆగ్రహం..

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: ఇటీవల సంవత్సరాల్లో ఐక్యరాజ్యసమితి అనేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం డెహ్రాడూన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పాకిస్తాన్‌ను ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు వైస్-చైర్‌గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో 9/11 దాడుల తర్వాత ఈ ప్యానెల్ ఏర్పడింది.

Read Also: Minister Narayana meets CM Yogi: యూపీ సీఎం యోగితో మంత్రి నారాయణ భేటీ..

‘‘అమెరికా 9/11 దాడుల సూత్రధారులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. ఇది అందరికి తెలుసు. ఇది పిల్లిని పాలకు కాపలాగా ఉంచడం లాంటిది’’ అని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం వైఖరి, చర్యల పద్ధతి మారిందని చెప్పారు. ఇటీవల భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ భారత చరిత్రలోనే ఉగ్రవాదంపై అతిపెద్ద చర్య అని అన్నారు.

పాకిస్తాన్ ‘‘ఉగ్రవాదానికి పితామహుడు’’ రాజ్‌నాథ్ అభివర్ణించారు. పాక్ ఎల్లప్పుడు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుందని, వారికి శిక్షణ ఇస్తుందని, అనేక రకాలుగా సహాయం అందిస్తోందని అన్నారు. ప్రపంచంలో ఉగ్రవాదానిక నిధులు, ఆశ్రయం కల్పించే దేశాలను బహిర్గతం చేయడం కూడా ముఖ్యమని ఆయన అననారు. పాకిస్తాన్‌కి అందుతున్న ఆర్థిక సాయం ఎక్కువగా ఉగ్రవాదానికి ఖర్చు అవుతోందని, ప్రపంచం దీనిపై నిద్రవీడాలని అన్నారు.

Exit mobile version