Site icon NTV Telugu

Rajnath Singh: కేంద్ర రక్షణ శాఖ మంత్రికి గుర్రాన్ని బహుమతిగా ఇచ్చిన దేశాధ్యక్షుడు

Rajnath Singh Mongolia Visit

Rajnath Singh Mongolia Visit

Rajnath Singh Gifted Horse By Mongolian President: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ మంగోలియా పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరు దేశాలు చర్చించనున్నాయి.  మంగోలియాలో పర్యటించిన తొలి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగే. ఏడేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ మంగోలియాలో పర్యటించారు.  ఆ సమయంలో మంగోలియా ప్రభుత్వం మోదీకి ఓ గుర్రాన్ని బహూకరించింది. తాజాగా రాజ్‌నాథ్ సింగ్‌ కు కూడా ఆ దేశాధ్యక్షడు ఖరేల్ సుఖ్ ఓ గుర్రాన్ని బహుమతిగా ప్రధానం చేశారు. ఈ విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గుర్రానికి ‘తేజస్’గా నామకరణం చేసినట్లు తెలిపారు. మంగోళియాలోని మా ప్రత్యేక స్నేహితుల నుంచి ప్రత్యేక బహుమతి అని.. నేను ఈ అద్భుత అందానికి తేజస్ గా పేరు పెట్టానని ప్రెసిడెంట్ ఖురేల్ సుఖ్ కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు.

మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, అధ్యక్షుడు ఉఖ్నాగిన్ ఖురేల్ సుఖ్ మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల మధ్య చర్యలు జరిగాయి. రాజధాని ఉలాన్ బాటర్ లో ఈ ఇరుదేశాల మధ్య సమావేశాలు జరిగాయి. 2018లో ఖురేల్ సుఖ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో రాజ్ నాథ్ సింగ్ భేటీ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మంగోలియా వ్యూహాత్మక భాగస్వామి అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

Read Also: Ponniyin Selvan Trailer: భారీ విజువల్ వండర్.. కానీ?

2015లో ప్రధాని నరేంద్రమోదీ తన చారిత్రాత్మక పర్యటన సందర్భంగా అప్పటి మంగోలియన్ ప్రెసిడెంట్ సైఖన్‌బిలెగ్, ప్రధాని మోదీకి ఓ గోధుమ రంగు గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు. చైనాకు సమీపంలో ఉండటంతో మంగోలియా, భారత దేశానికి వ్యూహత్మక భాగస్వామిగా ఉంది. ఈ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ సంబంధాలను మరింతగా విస్తరించాలనే లక్ష్యంతో రాజ్ నాథ్ సింగ్ మంగోలియాలో పర్యటిస్తున్నారు. ఐదురోజుల పర్యటనలో భాగంగా రాజ్ నాథ్ సింగ్ మంగోలియా, జపాన్ దేశాల్లో పర్యటిస్తారు.

Exit mobile version