Site icon NTV Telugu

Snake Man Passes Away: విషపూరిత పాముకాటుతో ‘స్నేక్ మ్యాన్’ మృతి

Snake Man

Snake Man

Snake Man Passes Away: దాదాపు 20 ఏళ్ల నుంచి పాములు పడుతున్న వ్యక్తి పాముకాటుకే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. చురు జిల్లాలో స్నేక్‌ మ్యాన్‌గా పేరొందిన వినోద్ తివారీ అనే వ్యక్తి దాదాపు గత 20 ఏళ్లుగా పాములను పట్టుకుంటున్నాడు. పాములను పట్టుకున్న తర్వాత వాటిని అడవిలో వదిలి వెళ్లేవాడు. ఈ మేరకు స్థానికులు అతని గురించి చెబుతున్నారు. అయితే, ఈ క్రమంలో శనివారం విషపూరిత నాగుపామును పట్టుకునే సమయంలో దాని కాటుకు గురై తివారీ మృతి చెందాడు.

పాములను పట్టడం, వాటిని అడవిలో వదిలిపెడుతుండడంతో వినోద్ తివారీ అక్కడి స్థానికులకు బాగా పరిచయమున్న వ్యక్తిగా మారిపోయాడు. ఈ క్రమంలో చురులోని గోగమేడి ప్రాంతంలోని ఓ దుకాణంలోకి వచ్చిన నాగుపామును పట్టుకోవడానికి వచ్చిన తివారీ… దుకాణం వెలుపల ఉన్న నాగుపామును పట్టుకున్నాడు. దాన్ని సంచిలో వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాము అతని వేలి మీద కాటు వేసింది. ఇదంతా అక్కడి సీసీటీవీ వీడియోలో రికార్డ్ అయ్యింది. అతను పట్టుకున్న ఆ పాము అత్యంత విషపూరితమైనది కావడంతో.. పాము కాటుకు వేసిన నిమిషాల వ్యవధిలోనే తివారి మృతి చెందాడు.

Asad Rauf: మాజీ అంపైర్ అసద్ రౌఫ్ గుండెపోటుతో హఠాన్మరణం

వినోద్ తివారీ ఆ ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా.. సమాచారం అందించగానే వచ్చి.. పట్టుకుని,సమీపంలోని అడవిలో వదిలేసేవాడు. అలా స్థానికులతో బాగా దగ్గరయ్యాడు. అతడిని వారు ‘స్నేక్ మ్యాన్’గా పిలిచేవారు. అలా స్థానికంగా ప్రసిద్ధి చెందాడు. ఆదివారం ఆయన అంత్యక్రియలకు పలువురు హాజరయ్యారు.

Exit mobile version