NTV Telugu Site icon

Heater Incident: హీటర్‌లో మంటలు.. తండ్రి, 3 నెలల కూతురు సజీవదహనం..

Rajasthan

Rajasthan

Heater Incident: రాజస్థాన్ రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. గదిలోని హీటర్‌కి మంటలు అంటుకోవడంతో తండ్రి, మూడు నెలల కూతురు సజీవదహనమయ్యారు. ఖైర్తాల్-తిజారా జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. గదిలోని హీటర్‌తో మంటలు చెలరేగడంతో తండ్రీ, కూతురు మరణించారు. ఈ ఘటనలో అతని భార్యకు గాయాలయ్యాయి.

Read Also: Drone Strike: హిందూ మహాసముద్రంలో మర్చంట్ నౌకపై డ్రోన్ దాడి..

దీపక్ యాదవ్, అతని కుమార్తె మూడు నెలల నిషిక సజీవ దహనయ్యారు. దీపక్ భార్య సంజుకి కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటనలో కేకలు విన్న ఇరుగుపొరుగు వారు బాధితులను రక్షించేందుకు, మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన ఇద్దరి ప్రాణాలు కాపాడలేకపోయారు. తీవ్రగాయాలైన తండ్రీ, కూతుళ్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన దీపక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చలికాలంలో ఇళ్లలో వినియోగించే హీటర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని వాడటానికి ముందు సరిగా ఉందో లేదో చూసుకోవాలని చెబుతున్నారు.