కరోనా సమయంలో యాచకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా లాక్ డౌన్ కారణంగా తిండిలేక నరకయాతనలు అనుభవించారు. ప్రభుత్వాలు వీరికోసం ప్రత్యేకంగా షల్టర్‌లు ఏర్పాటు చేసి కొంతమేర ఆదుకుంది. అయితే, రాజస్థాన్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని అవయవాలు సరిగా పనిచేస్తున్నప్పటికి విధి కారణంగా యాచక వృత్తిని స్వీకరిస్తుంటారు. ఇలాంటి వారికి గుర్తించి వారికి వొకేషనల్ లైఫ్ విట్ డిగ్నిటీ పేరుతో స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఏడాదికాలంపాటు శిక్షణ ఇస్తోంది. ఇప్పటి వరకు 100 మందిని గుర్తించిన ప్రభుత్వం ఏడాది కాలంపాటు శిక్షణ అందించింది. అందులో 60 మందికి ఇప్పటికే ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉపాది అవకాశాలను కల్పించింది. రాష్ట్రంలో యాచకులు అనేవారు ఉండకూడదని చెప్పి ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుంది.
Read: “శ్రీమంతుడు”కు ఆరేళ్ళు
