Site icon NTV Telugu

రూ.30 కోట్ల హెలీకాప్టర్… రూ.26 కోట్లు డిస్కౌంట్‌… ఎవరూ కొన‌ట్లేద‌ట‌…!!!

హెలీకాఫ్ట‌ర్ల ఖ‌రీదు చాలా ఎక్కువ‌గా ఉంటుంది.  ఇక ప్ర‌జా ప్ర‌తినిధులు, ముఖ్య‌మంత్రులు వాడే హెలీకాఫ్ట‌ర్ ఖ‌రీదు మ‌రింత ఎక్కువ.  వారి భ‌ద్ర‌త‌కు అనుగుణంగా ఉండే హెలీకాఫ్ట‌ర్ల‌ను కొనుగోలు చేస్తుంటారు.  రాజ‌స్తాన్ ప్ర‌భుత్వం 2005లో వ‌సుంధ‌ర రాజే ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇట‌లీకి చెందిన అగ‌స్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి ట్ఇన్ ఇంజిన్ 109 ఈ హెలీకాఫ్ట‌ర్‌ను కొనుగోలు చేశారు.  వ‌సుంధ‌రా రాజే ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఈ హెలీకాఫ్ట‌ర్‌ను వినియోగించారు.  ఆ త‌రువాత అధికారం మారింది.  అశోక్ గెహ్లాట్ ముఖ్య‌మంత్రి అయ్యాక అధికారిక కార్య‌క్ర‌మానికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ హెలీకాఫ్ట‌ర్‌లో సాంకేతిక లోపం ఏర్ప‌డింది.  దీంతో ఆ హెలీకాఫ్ట‌ర్‌ను అత్య‌వ‌స‌రంగా దించేశారు.  అప్ప‌టి నుంచి ఈ ట్విన్ ఇంజిన్ 109 ఈ హెలీకాఫ్ట‌ర్ రాజ‌స్థాన్ గూడౌన్‌లో వృధాగా ప‌డి ఉన్న‌ది.  ముఖ్య‌మంత్రులు మారిన‌ప్ప‌టికీ ఈ హెలీకాఫ్ట‌ర్‌ను వాడ‌డం లేదు.  దీంతో దీనిని అమ్మాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  గ‌తంలో 12 సార్లు టెండ‌ర్లు పిలిచారు.  కానీ కొనేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు.  దీంతో ఏకంగా ఈ హెలీకాఫ్ట‌ర్‌కు రూ.26 కోట్లు డిస్కౌంట్ ఇస్తూ కేవ‌లం రూ.4 కోట్ల‌కే అమ్మేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం.  మ‌రి ఇంత త‌క్కువ‌కు అమ్మాల‌ని చూస్తున్న రాజ‌స్థాన్ ఈసారైనా దాన్ని వ‌దిలించుకుంటుందా?  చూడాలి.  

Read: ఐసిస్ ఖోరోస‌న్ అంటే ఏమిటీ? తాలిబ‌న్ల‌కు వీరు వ్య‌తిరేక‌మా?

Exit mobile version