NTV Telugu Site icon

Borewell Incident: 6 రోజులుగా బోరు బావిలోనే మూడేళ్ల బాలిక.. కాపాడాలని వేడుకుంటున్న తల్లి..

Borewell Incident

Borewell Incident

Borewell Incident: రాజస్థాన్‌లో బోరు బావి ఘటనలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడాలని యావత్ దేశం కోరుకుంటోంది. అయితే, గత 6 రోజులుగా బాలిక బావిలోనే ఉంది. చిన్నారిని రక్షించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. 700 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో ఆడుకుంటూ బాలిక అందులో పడిపోయింది. 150 అడుగుల లోతులో చిన్నారి చేత్నా చిక్కుకుంది. రాజస్థాన్ కోట్‌పుట్లీలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

Read Also: Congress: మన్మోహన్ సింగ్ మరణంపై బీజేపీ రాజకీయం.. సిద్ధూ విమర్శలు..

తన కూతురిని రక్షించాలని ఆమె తల్లి ధోలే దేవీ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. రోజులు గడుస్తున్నా, తన కూతురు బయటకు రాకపోవడంతో అధికారులు ఎలాగైనా తన కుమార్తెని రక్షించాలని వేడుకుంటోంది. అధికారులు స్పందించడం లేదని చత్నా మేనమామ శుభ్‌రామ్ శనివారం ఆరోపించారు. మేము ప్రశ్నిస్తే కలెక్టర్ మేడం చెబుతారని చెబుతున్నారని, ఆమె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ కుటుంబాన్ని పరామర్శించలేదని ఫిర్యాదు చేశారు.

చెత్నా తల్లి తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది. తన బిడ్డను బయటకు తీసుకురావాలని తీవ్రంగా అభ్యర్థిస్తోంది. చిన్నారిని రక్షించేందుకు నిరంతరంగా రెస్క్యూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం వరకు కేసింగ్ పైపు వెల్డింగ్ పూర్తయింది. 90 డిగ్రీల కోణంలో 8 అడుగుల సమాంతర సొరంగం తవ్వడం ప్రారంభమైంది. దీని ద్వారా చేత్నాని బయటకు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఆపరేషన్ కోసం ఫ్యాన్లు, లైట్లు, ఆక్సిజన్, కట్టర్ మిషన్‌లను బోర్‌వెల్‌లోకి పంపారు. పాప కోసం ఆక్సిజన్‌ని బోరు బావిలోకి పంపిస్తున్నారు.

Show comments