Site icon NTV Telugu

Vishwendra Singh: మాజీ మంత్రికి తప్పని భార్య వేధింపులు.. నెలకు రూ. 5 లక్షలు డిమాండ్..

Vishwendra Singh

Vishwendra Singh

Vishwendra Singh: రాజస్థాన్ మాజీ మంత్రి, భరత్‌పూర్ రాజకుటుంబ సభ్యుడు విశ్వేంద్ర సింగ్ తన భార్య, కొడుకుపై సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య, కొడుకు నుంచి భరణం కోరాడు. వారు తనను కొడుతున్నారని, తగినంత ఆహారం ఇవ్వడం లేదని, చివరకు ప్రజల్ని కలిసేందుకు కూడా అనుమతించలేదని ఆయన ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్ని మాజీ మంత్రి భార్య, కొడుకు కొట్టిపారేశారు. విశ్వేంద్ర సింగ్ గతంలో మాజీ ఎంపీ అయిన తన భార్య దివ్యాసింగ్, కొడుకు అనిరుధ్ సింగ్‌సై సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్(ఎస్‌డీఎం) ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విశ్వేంద్ర సింగ్ కొడుకు అనిరుధ్ మాట్లాడుతూ.. ఇది ఎస్‌డీఎం కోర్టుపై ఒత్తిడి తేచ్చే వ్యూహాలు తప్పా మరొకటి కాదని ఆయన అన్నారు. ఎస్‌డీఎం కోర్టు, గౌరవనీయులైన న్యాయమూర్తి ఈ వ్యవహారాన్ని సునాయాసంగా, న్యాయంగా వ్యవహరిస్తారని మా అమ్మ, నాకు అత్యంత విశ్వాసం ఉందని, ఈ విషయం కొత్తది కాదని, మార్చి 6 2024 నుంచి ఇది కొనసాగుతూనే ఉందని సోషల్ మీడియా పోస్టులో అనిరుధ్ వెల్లడించారు.

Read Also: Uttar Pradesh: రాహుల్ గాంధీ-అఖిలేష్ యాదవ్ సభలో తొక్కిసలాట.. కార్యకర్తల మధ్య ఘర్షణ..

‘‘ నేను నా ఇంటిని(మోతీ మహల్) వదిలి వెళ్లాల్సి వచ్చింది. నేను సంచార జీవితాన్ని గడుపుతున్నాను. నేను కొన్నిసార్లు ప్రభుత్వం గెస్ట్‌హౌజుల్లో, కొన్ని సార్లు హోటల్ గదుల్లో ఉండాల్సి వస్తోందని. నేను భరత్‌పూర్ వెళ్లినప్పుడు, ఇంట్లో నాభార్య, కొడుకుతో కలిసి జీవించడం సాధ్యం కాదు. ఒక గదికే పరిమితమవుతున్నాను’’ అని విశ్వేంద్ర సింగ్ తన దరఖాస్తులో పేర్కొన్నాడు. భార్య, కుమారుడి నుంచి తనకు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారిద్దరు తనను చంపడానికి కుట్ర పన్నారని అతను ఆరోపించాడు. నా జీవితాన్ని అంతం చేయడం, నా ఆస్తుల్ని లాక్కోవడం వారి లక్ష్యమని దరఖాస్తులో ఆరోపించారు. భవిష్యత్తులో వారి ప్రవర్తన మారుతుందని భావించానని, అది జరగలేదని, నా గదికి తాళం వేసి బలవంతంగా తనను బయటకు గెంటేశారని పేర్కొన్నాడు.

తాను హార్ట్ పేషెంట్‌ని అని, చికిత్స సమయంలో తనకు రెండు స్టెంట్స్ అమర్చారని, నేను ఈ టెన్షన్ భరించలేదని, ఇది తనకు ప్రాణాంతకంగా మారుతుందని దరఖాస్తులో చెప్పారు. 2021 మరియు 2022 సంవత్సరాలలో నాకు రెండుసార్లు కరోనా వచ్చింది, కానీ నా కొడుకు మరియు భార్య ఎటువంటి శారీరక, మానసిక లేదా ఆర్థిక సహాయం అందించలేదని చెప్పారు. మా నాన్న వీలునామా ద్వారా సంక్రమించిన ఆస్తులు నా సొంతమని, నా భార్య, కొడుకు నా బట్టల్ని బావిలో పడేశారని, పేపర్లు, రికార్డులు చించేశారని, టీ, నీళ్లు కూడా ఇవ్వలేదని తన భార్య, కొడుకు కూడా సోషల్ మీడియా ద్వారా తనపై దుష్ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని కోర్టుని కోరారు. మోతీ మహల్ ప్యాలెస్ తనకు ఇవ్వాలని కోరారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని విశ్వేంద్ర కొడుకు అనిరుధ్ పేర్కొన్నారు. నిజమైన బాధితులం తామే అని చెప్పారు.

Exit mobile version