Site icon NTV Telugu

Rajastan: ఫస్ట్ నైట్ రోజే నగలతో పెళ్లి కూతురు జంప్.. చర్చనీయాంశంగా మారిన ఘటన

Untitled Design (4)

Untitled Design (4)

రాజస్థాన్ లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఫస్ట్ నైట్ రోజే పెళ్లి కూతురు పారిపోయింది. ప్రస్తుతం ఈ వార్త అక్కడ సంచలనంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అజ్మీర్‌లోని కిషన్‌గఢ్‌లో జరిగిన ఒక వివాహం వార్తల్లో నిలుస్తోంది. ఘనంగా జరిగిన వివాహ ప్రమాణాలు స్వాగత వేడుకతో అంతా సాధారణంగానే జరిగింది. కానీ వివాహ రాత్రి వధువు తన భర్తతో ఫస్ట్ నైట్ జరగడాన్ని నిరాకరించింది. అయితే ఆమె అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆమె నగలు ,నగదుతో పాటు అదృశ్యం కావడం కలకలం రేపింది.

రాకేష్ అనే యువకుడి వివాహం జైపూర్‌లో చాలా వైభవంగా జరిగింది. అనంతరం వరుడి ఇంట్లోకి కోడలికి వరుడి తల్లి ఘన స్వాగతం పలికింది. అయితే మొదటి రాత్రి కోసం ఇక్కడ ఇది ఆచారమని.. ఫస్ట్ నైట్ కోడలికి నగలు బహుకరించింది అత్త. .. వధువు తన భర్తతో ఫస్ట్ నైట్ వద్దని చెప్పింది. అంతే కాకుండా అర్థరాత్రి నగలు, డబ్బుతో వధువు కనిపించకుండా పోవడంతో.. అందరూ ఆశ్చర్యపోయారు.

Exit mobile version