Site icon NTV Telugu

Honeymoon Murder: రాజా రఘువంశీ-సోనమ్‌కి పెళ్లి కుదిర్చింది ఎవరు? బంధువు ఏం చెప్పాడంటే..!

Honeymoonmurder2

Honeymoonmurder2

రాజా రఘువంశీ-సోనమ్ చూడముచ్చటైన జంట. ఏ ఫొటోలు చూసినా.. ఏ వీడియో చూసినా చాలా చక్కగా.. చిలకగోరింకల్లా ఉన్నారు. ఇక ఇరు కుటుంబాలు కూడా ఆర్థికంగా బలమైన కుటుంబాలే. కొత్త జంట ఎంత సంతోషంగా ఉండొచ్చో వేరే చెప్పనక్కర్లేదు. కానీ మూఢురాలైన సోనమ్.. తన చేతులతో తన జీవితాన్నే నాశనం చేసుకుంది. తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా పలు కుటుంబాల్లో తీరని దు:ఖాన్ని నింపింది. దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. మహిళా లోకమే ‘ఛీ’ అంటోంది. ప్రస్తుతం ఒక రిమాండ్ ఖైదీగా పోలీసులు అటు.. ఇటు తిప్పుతున్నారు. సరైన నిద్ర లేదు. ఆహారం లేదు. జీవితమే చీకటైపోయింది. నా అన్న వాళ్లు కూడా బంధాలు తెంచుకున్నారు. ఇక ఆ జీవితానికి విలువ ఏముంటుంది?.. పోనీ.. ప్రియుడేమైనా పెళ్లి చేసుకుంటాడా? అంటే అది గ్యారంటీ లేదు. మొత్తానికి జీవితమే కారు చీకటైపోయింది.

ఇది కూడా చదవండి: Honeymoon Murder: మరో ట్విస్ట్.. జితేంద్ర యూపీఐ నుంచి నిందితులకు నగదు బదిలీ! పోలీసుల ఆరా

అయితే సోనమ్ ఏ ఫొటోల్లోనూ.. వీడియోల్లోనూ సంతోషంగా కనిపించలేదు. ముభావంగానే ఉంది. ఎవరైనా నవ్వమంటే నవ్వేది తప్ప.. స్వతహాగా నవ్వేది కాదు. అలాగే రాజా ముఖంలో కూడా అంత సంతోషం కనిపించ లేదు. తాజాగా రాజా రఘువంశీతో సోనమ్‌కి పెళ్లి సంబంధం ఎలా కుదిరిందన్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు వారిద్దరు ఎలా కలిశారు అనే విషయాలను రాజా రఘువంశీ బంధువు వెల్లడించాడు.

ఇది కూడా చదవండి: Surekha Vani : సురేఖా వాణి టాటూ వివాదం.. ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్..

రాజా రఘువంశీకి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నప్పుడు మ్యాట్రిమోనియల్ యాప్ ద్వారా సోనమ్ కలిసిందని రాజా రఘువంశీ బంధువు అర్పిత్ తెలిపారు. అంతకముందు రాజా-సోనమ్ మధ్య ఎలాంటి పరిచయాలు లేవని చెప్పాడు అనంతరం ఇరు కుటుంబాలు కలుసుకున్నాయని.. అంతేకాకుండా ఇరు కుటుంబాలు కూడా ఇళ్లులు కూడా సందర్శించుకున్నాయని చెప్పాడు. అంతా ఒకే అన్నాకే.. ఫిబ్రవరి 10న సోనమ్ ఇంట్లోనే నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించాడు.

ఇక నిశ్చితార్థం జరిగాక పెళ్లి డేట్ మే 11న పెట్టుకున్నట్లు తెలిపాడు. ఆ గ్యాప్‌లో సోనమ్‌తో రాజా ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాడని.. కానీ సోనమ్ ఎప్పుడూ కూడా అందుబాటులోకి రాలేదన్నాడు. సోనమ్‌తో మాట్లాడలేకపోతున్నానని.. తనతో చెప్పుకుని బాధపడుతూ ఉండేవాడని పేర్కొన్నాడు. ఒకవేళ ఫోన్ ఎత్తితే.. వ్యాపారంలో బిజీగా ఉన్నానని.. తర్వాత కాల్ చేస్తానంటూ ఫోన్ పెట్టేసేదని తనతో చెప్పాడని అర్పిత్ తెలిపాడు. తన సోదరుడి వ్యాపారాన్ని చూస్తున్నట్లు చెప్పేదని.. కుటుంబ సభ్యుల సమాచారాన్ని పంచుకునేందుకు చాలా సార్లు ప్రయత్నిస్తే.. ఏ రోజున అందుబాటులోకి రాలేదని అర్పిత్ వివరించాడు.

సోనమ్ పెళ్లి సమయంలో కూడా ఎలాంటి అనుమానాలు రాకుండా చూసుకుందని.. ఇక హనీమూన్ సమయంలో జంట తప్పిపోవడంతో అందరం భయాందోళన చెందినట్లు తెలిపాడు. ఇక రాజా మృతదేహం లభించిన తర్వాత సోనమ్ క్షేమంగా రావాలని మేమంతా ప్రార్థనలు చేశామని.. కానీ అసలు విషయం తెలిసి అంతా షాక్ అయినట్లు వివరించాడు. రాజాకు ముగ్గురు సోదరులున్నారని.. రాజాను చాలా ప్రేమగా చూసుకునేవాళ్లమని అర్పిత్ తెలిపాడు. రాజా చాలా అమాయకుడిగా ఉండేవాడని.. ఎవరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవన్నాడు. ఇక సోనమ్ సోదరుడు గోవింద్ పరిణితి చెందిన వాడని.. అతడు సత్యం వైపు నిలబడ్డాడని చెప్పుకొచ్చాడు.

రాజా రఘువంశీ-సోనమ్‌కు మే 11న వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వచ్చారు. మే 23న అత్యంత దారుణంగా రాజాను సోనమ్ హంతక ముఠాతో చంపించింది. అనంతరం వారితో కలిసి భర్త మృతదేహాన్ని లోయలో తోసేసింది. అనంతరం ఇండోర్‌కు వచ్చి ఒక గది అద్దెకు తీసుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసింది. అటు తర్వాత యూపీకి పారిపోయారు. జూన్ 9న ఘాజీపూర్‌లో సోనమ్ లొంగిపోయింది. ప్రస్తుతం మేఘాలయ పోలీస్ కస్టడీలో నిందితులు ఉన్నారు.

Exit mobile version