Site icon NTV Telugu

Raja Pateriya: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్

Raja Pateriya Arrested

Raja Pateriya Arrested

Raja Pateriya Arrested For Making Shocking Comments On Modi: ప్రధాని నరేంద్ర మోడీపై మధ్యప్రదేశ్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాజా పటేరియా చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే మోడీని చంపేయాలని.. అందుకు సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్ కార్యకర్తల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన ఆ మాట అనడమే ఆలస్యం.. వెంటనే వ్యతిరేకత ఎదురైంది. ఆ తీవ్రతను గమనించి.. ‘చంపడం’ అంటే ‘ఓడించడం’ అని తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు. అయితే.. పటేరియా వ్యాఖ్యలు వైరల్ కావడంతో, వివాదం చెలరేగింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ స్పందిస్తూ.. ఇది క్షమించరాని నేరమని అన్నారు. పటేరియాను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయగా.. ఆయనపై కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పోలీసుల్ని ఆదేశించింది.

Pakistan: మేం పాకిస్తాన్‌లో ఉండలేం.. దేశం వీడేందుకు సిద్ధం

దీంతో.. పోలీసులు రంగంలోకి దిగి, పటేరియాను అరెస్ట్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని దమో జిల్లా హత్తా తెహసిల్‌లో ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పవాయికి తీసుకెళ్లి, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ వ్యవహారంపై పవాయి డీఎస్పీ సౌరభ్ రత్నాకర్ మాట్లాడుతూ.. సంజయ్ ఖారే అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పటేరియాపై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. సెక్షన్స్ 451, 504, 505(1)(b), 505 (1)(c)పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. అటు.. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా పటేరియా అరెస్ట్‌ని ధృవీకరించారు. అంతేకాదు.. 115, 117 సెక్షన్లను సైతం ఎఫ్ఐఆర్‌కు జత చేయడం జరిగిందని తెలిపారు.

Akhilesh Yadav: 2024లోగా బీజేపీకి ప్రత్యామ్నాయం.. ఆ దిశగా కేసీఆర్ కృషి

Exit mobile version