NTV Telugu Site icon

Raj Thackeray: రేపు పుణేలో రాజ్ ఠాక్రే భారీ ర్యాలీ….

Raj Thackeray

Raj Thackeray

మహారాష్ట్ర రాజకీయాలు రాజ్ ఠాక్రే కేంద్రంగా సాగుతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు అధికారంలో ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ రాజకీయంగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా శివసేన, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని టార్గెట్ చేస్తూ రాజ్ ఠాక్రే రాజకీయం చేస్తున్నారు. ఇటీవల మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయాలని మహా సర్కార్ కు అల్టిమేటం జారీ చేసి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయకుంటే… పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసాను పఠిస్తామని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే రాజ్ ఠాక్రే రేపు పుణేలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు రాజ్ ఠాక్రే. అయితే ఈ ర్యాలీకి సంబంధించి పోలీసులు 13 ఆంక్షలను విధించారు. ఒక వేళ ఉల్లంఘనటకు పాల్పడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ర్యాలీ సమయంలో ఎలాంటి రెచ్చగొట్టే నినాదాలు చెయవద్దని, అల్లర్లకు పాల్పడవద్దని,  కార్యక్రమంలో ఎలాంటి ఆయుధాలు, కత్తులు , పేలుడు పదార్థాలు తీసుకురాకూడదని… లౌడ్ స్పీకర్ల వాడకం శబ్ధ కాలుష్య నియమాలను ఉల్లంఘించవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు.

రాజ్ ఠాక్రే నిర్వహిస్తున్న ర్యాలీపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారో అని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీనే రాజ్ ఠాక్రే వెనకాల ఉండీ కథ నడిపిస్తోందని శివసేన ఆరోపిస్తోంది. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రగా అభివర్ణిస్తోంది. ఇదిలా ఉంటే ముంబైలో ఇటీవల రాజ్ ఠాక్రే పేరుతో పెట్టిన ప్లెక్సీల్లో ఎంఎన్ఎస్ పార్టీ నేతలు నేరుగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజ్ ఠాక్రేకు ఎదైనా జరిగితే మహారాష్ట్ర అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.