Site icon NTV Telugu

Raj Kushwaha: నా కొడుకు నిర్దోషి.. ఏ పాపం తెలియదు.. సోనమ్ ప్రియుడి తల్లి ఆవేదన

Rajkushwaha

Rajkushwaha

తన కొడుకు నిర్దోషి అని.. ఏ పాపం తెలియదని సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మీడియాతో మాట్లాడింది. తన కొడుకు.. సోనమ్ ఒకే దగ్గర పని చేశారని తెలిపింది. తన కొడుకుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయింది.

ఇది కూడా చదవండి: Sonam Raja Wedding: సోదరుడి మరణాన్ని క్యాష్ చేసుకుంటున్న రాజా సోదరి.. పెళ్లి వీడియోలు వైరల్ చేస్తు్న్న ఇన్‌ఫ్లుయెన్సర్

తన కొడుకు అలాంటి పని చేయడని.. అతనికి ఇప్పుడు 20 సంవత్సరాలు అని తెలిపింది. తనకు ఒక్కగానొక్క కొడుకు అని.. సోనమ్ సోదరుడికి చెందిన ఫ్యాక్టరీలో తన కొడుకు పని చేసేవాడని.. సోనమ్ కూడా అక్కడే పని చేసేదని తెలిపింది. పని చేసే దగ్గర ఇద్దరూ కలిసే ఉండేవారని.. అంతేతప్ప ఇంకేమీలేదని చెప్పుకొచ్చింది. కావాలనే తన కొడుకుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకు చాలా దయగల వాడని.. అంతేకాకుండా అమాయకుడని చెప్పింది. ఎవరైనా చెప్పులు లేకుండా నడుస్తుంటే వాళ్లకు చెప్పులు కొనిచ్చేవాడని గుర్తుచేసింది. ఇప్పటికీ దానం చేస్తూనే ఉంటాడని తల్లి ఏడుస్తూ చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: Sonam Raghuwanshi: మే 23న సోనమ్‌కు అత్త ఫోన్ కాల్.. రాజా గురించి అడిగితే ఏం సమాధానం చెప్పిందంటే..!

అలాగే రాజ్ కుష్వాహా సోదరి కూడా తన సోదరుడు నిర్దోషి అని చెప్పుకొచ్చింది. తన సోదరుడు హత్య చేసే మనిషి కాదని వాపోయింది. తన సోదరుడు నగరంలోనే ఉన్నాడని.. ఇక్కడ ఉన్నాడో లేదో కార్యాలయ రికార్డులను తనిఖీ చేయాలని రాజ్ కుష్వాహా సోదరి కోరింది. దయచేసి తన సోదరుడిని కాపాడాలని వేడుకుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు తన సోదరుడు ఇంటికి వచ్చాడని.. ఆలయానికి వెళ్లేందుకు కొత్త బట్టలు, బూట్లు ధరించాడని చెప్పుకొచ్చింది.

 

 

Exit mobile version