వానలు వచ్చాయ్.. వరదలు వచ్చాయ్.. ఊరువాడా నీటిలో మునిగే.. ఇది ఇప్పుడు దేశ పరిస్థితి.. ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో దేశం మొత్తం నిండు కుండలా ఉంది..ఇక గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని రాష్ట్రాల్లో వరదలు ముంచేత్తుతున్నాయి.. ఎప్పుడు ప్రాణాలు హరి అంటాయా అని జనం భయంతో కంటి మీద కునుకు లేకుండా ఉండారు..కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్లు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి.. వరదల్లో రాలేక బంధువులు వీడియో కాల్ లో అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు.. ఇది ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లోనే..
సిమ్లా జిల్లాలోని కోట్‌ఘర్ ప్రాంతానికి చెందిన ఆశిష్ సింఘాకు, కులు జిల్లా భుంతార్ ప్రాంతానికి చెందిన శివానీ ఠాకూర్‌కు గతంలో వివాహం నిశ్చయించారు. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అయితే కొన్ని రోజులుగా ఉత్తర భారత దేశాన్ని భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు తెగిపోయాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. జనజీవనం మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడి రాకపోకలు పూర్తిగా మూసుకుపోయాయి. దీంతో కులు ప్రాంతంలో పెళ్లి జరగాల్సి ఉండగా.. అక్కడికి వెళ్లడానికి వరుడి కుటుంబానికి రాకపోకలు లేకుండా పోయాయి..
ఇరు కుటుంబాలు మాత్రం అదే ముహూర్తనికి పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నారు..ఎలాగైనా పెళ్లి మండపానికి చేరుకోవాలని ప్రయత్నాలు చేశారు. కనీసం అతిథులు రాకపోయినా పర్లేదు.. కుటుంబ సభ్యులైనా వెళ్లాలని చూశారు. అయితే వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక ఏం చేద్దామని ఆలోచించారు. అదే సమయంలో వారికి ఒక ఆలోచన వచ్చింది. ఆన్‌లైన్‌లో పెళ్లి నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే బంధువులు, అతిథులు అందరికీ సమాచారం అందించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆశిష్, శివానీల వివాహం జరిపిస్తున్నట్లు అందిరికీ తెలియజేసి..పెళ్లికి సంబంధించిన ఆన్‌లైన్ లింకును అందరికీ పంపించారు. అనంతరం వారి పెళ్లిని ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు.. బయట అంతగా వరదలు వస్తున్నా పెళ్లి తో ఒక్కటైనా జంట పై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇంకా కొద్ది రోజులు వర్షాలు కురిస్తే ఇలానే పెళ్లిళ్లు జరుగుతాయని కొందరు కామెంట్ చేస్తున్నారు..