NTV Telugu Site icon

Indian Railways: రైల్వేలో సిబ్బంది కొరత.. రిటైర్డ్ ఉద్యోగులకు లక్కీ ఛాన్స్!

Indianrailway

Indianrailway

ఇండియన్ రైల్వేలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. చాలా రోజులుగా రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో కొంది మందితోనే రైల్వేశాఖ నడిపించేస్తోంది. దీంతో ఎంప్లాయిస్ పని భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు జోన్లలో 25 వేల ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది. అయితే కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా.. రిటైర్డ్ ఉద్యోగులకు ఛాన్స్ ఇచ్చింది. రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Zubeida: షాకింగ్ : దెయ్యంలా మారిన బాలీవుడ్ నటి?

సూపర్‌వైజర్ల నుంచి ట్రాక్‌మెన్‌ వరకు పలు ఉద్యోగాలకు రైల్వే నుంచి రిటైర్‌ అయిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే 65 ఏళ్ల లోపు వారు మాత్రమే ఇందుకు అర్హులని చెప్పినట్లు సమాచారం. రెండేళ్ల పదవీకాలానికి గాను వీరిని నియమించుకోనున్నారు. అవసరమైతే పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జోనల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. రిటైర్డ్‌ ఉద్యోగులు గత ఐదేళ్ల మెడికల్‌ ఫిట్‌నెస్‌తో పాటు, పదవీ విరమణకు ముందు ఉద్యోగంలో ఉన్నప్పుడు వారి పనితీరును పరిశీలించి ఈ నియామకాలు చేపట్టనున్నారు. గతంలో విజిలెన్స్‌, లేదా డిపార్ట్‌మెంట్‌ చర్యలను ఎదుర్కొన్న వారు దరఖాస్తులకు అనర్హులని తేల్చినట్లు సమాచారం.

సిబ్బంది కొరతతో పాటు గత కొంతకాలంగా రైలు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్క వాయవ్య రైల్వే జోన్‌లోనే 10వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. మిగతా జోన్లలోనూ పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం ఉందని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఎల్‌జీ ఆమోదం..