Site icon NTV Telugu

పలు రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..!

trains

trains

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌.. ఎందుకంటే సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు అయితే.. మరికొన్ని దారి మళ్లించారు అధికారులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా బెంగళూరు వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే .. యలహంక – పెనుకొండ మధ్య డబ్లింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా.. ఈ నెల 12, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ – యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్, సోలాపూర్ – హసన్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేసినట్టుగా పేర్కొంది.. ఇక, మరో ఆరు రైళ్లు పాక్షికంగా రద్దు చేయగా.. 12 రైళ్లను దారి మళ్లించినట్టు సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే ప్రకటించింది.

Read Also: మళ్లీ బర్డ్‌ ఫ్లూ కలకలం..

ఇక, సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే రద్దు చేసిన రైళ్ల విషయానికి వస్తే.. ఈ నెల 12వ తేదీన సికింద్రాబాద్‌ – యశ్వంత్ పూర్ మధ్య నడిచే 12735 నెంబర్ గల రైలు, యశ్వంత్ పూర్ – సికింద్రాబాద్‌ మధ్య నడిచే 12736 నెంబర్ గల రైలును రద్దు చేసినట్టు వెల్లడించింది.. ఇక, 12, 13, 14 తేదీల్లో సోలాపూర్ – హసన్ మధ్య నడిచే 11311 నెంబర్ గల రైలును, హసన్ – సోలాపూర్ మధ్య నడిచే 11312 నెంబర్ గల రైలును కూడా రద్దు చేసినట్టు సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే ప్రకటించింది. నిత్యం రైళ్లలో ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరు.

Exit mobile version