Site icon NTV Telugu

ఆలస్యంగా నడిచిన రైలు… రూ.1.36 లక్షలను పరిహారంగా చెల్లించిన రైల్వేశాఖ

చలి కాలం సందర్భంగా యూపీలో విపరీతంగా పొగమంచు కురుస్తోంది. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే నిబంధనల ప్రకారం తేజస్ రైలు ఆలస్యంగా నడిస్తే రైల్వేశాఖ ప్రయాణికులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. చలికాలం నేపథ్యంలో తేజస్ రైలు కూడా రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. శుక్రవారం నాడు అలీగఢ్, ఘజియాబాద్ మధ్య దట్టమైన పొగమంచు ఏర్పడిన కారణంగా తేజస్ రైలును అధికారులు నిలిపివేయడంతో ఆలస్యానికి కారణమైంది.

Read Also: కరోనా కాలం.. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య

షెడ్యూల్ ప్రకారం తేజస్ రైలు లక్నో నుంచి ఢిల్లీకి మధ్యాహ్నం 12:25 గంటలకు చేరుకోవాలి. కానీ మధ్యాహ్నం 2:19 గంటలకు చేరుకుంది. ఈ రైలులో 544 మంది ప్రయాణికులు ఉండగా.. ఐఆర్‌సీటీసీ నిబంధనల ప్రకారం రైల్వేశాఖ వీరందరికీ రూ.250 చొప్పున నష్టపరిహారం చెల్లించింది. దీంతో మొత్తం రూ.1.36 లక్షలను రైల్వేశాఖ అధికారులు పరిహారంగా చెల్లించారు. కాగా తిరుగు ప్రయాణంలోనూ తేజస్ రైలు గంట ఆలస్యంగా ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరి వెళ్లింది.

Exit mobile version