Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Railway Department Big Shock To Senior Citizens And Journalists

Railway Shock: సీనియర్ సిటిజన్లకు, జర్నలిస్టులకు రైల్వేశాఖ షాక్.. ?

Published Date :July 21, 2022 , 12:46 pm
By NTV WebDesk
Railway Shock: సీనియర్ సిటిజన్లకు, జర్నలిస్టులకు రైల్వేశాఖ షాక్.. ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీనియర్‌ సిటిజన్లుతో పాటు.. జర్నిలిస్టులకు, విధ్యార్థులకు ఊహించని షాక్‌ ఇచ్చింది రైల్వేశాఖ. టికెట్‌ ధరపై సీనియర్‌ సిటిజన్లకు ఇస్తున్న రాయితీ కట్‌ చేయడమేకాకుండా.. విద్యార్థులు, జర్నలిస్టులకు వివిధ కోటాల్లో ఇస్తున్న సబ్సిడీలను మంగళం పాడింది. అయితే గతంలో అమలులో ఉండి ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ తొలగించిన సబ్సిడీలపై కేంద్ర సర్కార్‌ తాజాగా తన అభిప్రాయాన్ని తెలిపి, సబ్సీడీలను తిరిగి పునరుద్దరించే అవకాశం లేదని తేల్చి చెప్పేసింది.

నిజానికి కరోనా సమయంలోనే అన్ని రాయితీలను రైల్వే శాఖ రద్దు చేసింది. సీనియర్‌ సిటిజన్లకు ఇస్తున్న రాయితీని కట్‌ చేసింది. విద్యార్థులకు, జర్నలిస్టులకు తదితరులకు ఇచ్చే రాయితీని నిలిపివేసింది. కాగా.. 50 ఏళ్లు దాటిన మహిళలకు రైల్వే శాఖ 50 శాతం, 60 ఏళ్లు దాటిన పురుషులకు టికెట్‌ ధరలో 40 శాతం రాయితీ ఇచ్చేది. ఒక జర్నలిస్టులకు 50 శాతం రాయితీ, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఏడాదిలో రెండుసార్లు రాయితీపై ప్రయాణించే అవకాశం కల్పించేది. ఇక విద్యార్థులకు జాతీయ స్థాయి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాయితీలు ఉండేవి, దావ్యాంగలకు కూడా కొన్ని రాయితీలు అందించేది రైల్వేశాఖ. ఇటువంటి రాయితీలకు రైల్వే శాఖస్వస్తి చెప్పింది.

అయితే గతంలో సీనియర్‌ సిటిజన్లకు ఉన్న రాయితీలను పునరుద్దరించే ఉద్దేశం లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ లోక్‌ సభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా పార్లమెంట్‌ లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. రైల్వే శాఖకు నష్టాలు రావడానికి కారణాలు చెప్పకొచ్చారు. రైల్వే టికెట్‌ ధరలు తక్కువగా ఉండటమే నష్టానికి కారణమని , కొవిడ్‌ కారణంగా ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిందని పేర్కొన్నారు. రాయితీ వల్ల రైల్వేశాఖపై భారం పడుతోందని పేర్కొన్నారు. రాయితీ వల్ల 2017-20 మధ్య కాలంలో 4వేల 794 కోట్ల రూపాయల ఆదాయాన్ని భారతీయ రైల్వేలు నష్టపోయాయని, అందుకే సీనియర్‌ సిటిజన్లు, జర్నలిస్టులు, విద్యార్థులకు రాయితీ పునరుద్ధరణ కుదరదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి తేల్చి చెప్పారు.

Goods and Services Tax : ఏం తినేటట్టు లేదు..ఏం కొనేటట్టు లేదు..సామాన్యుడిపై జీఎస్టీ బాదుడు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashwini Vaishnav‌
  • indian railway
  • journalists
  • railway tickets
  • senior citizens

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions