Site icon NTV Telugu

Rahul Gandi Bharat Jodo Yatra Live: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

Rahul1

Rahul1

https://www.youtube.com/watch?v=dzooF8PWRh0

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. కేరళలో పాదయాత్రలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేరళలోని హరిపాద్‌లో జరుగుతోన్న భారత్ జోడో యాత్రలో ఆదివారం ఆసక్తికర ఘటన జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనతో పాటు నడుస్తోన్న ఓ చిన్నారి పాదరక్ష బెల్ట్ ఊడిపోయింది. నడవడంలో ఇబ్బంది పడుతోన్న చిన్నారిని చూసిన రాహుల్ వెంటనే స్పందించారు. అక్కడికి వెళ్లి స్వయంగా సరిచేశారు. ఆ సమయంలో కొందరు కార్యకర్తలు వీడియో తీశారు. ఈ వీడియోను భారత్ జోడో సోషల్ మీడియా టీమ్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది, రాహుల్ గాంధీ సామాన్యుడిలా మారిన తీరుపై కాంగ్రెస్ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవాళ 12 వ రోజు కొనసాగనుంది రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర. ఇప్పటివరకు 11 రోజుల పాటు రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర పూర్తి అయింది. కేరళలో కొనసాగుతుంది పాదయాత్ర. ఉదయం నుంచి వేలాదిమంది యాత్రలో పాల్గొంటున్నారు.

Exit mobile version