NTV Telugu Site icon

Rahul Gandhi: కెవెంటర్స్ స్టోర్‌లో కాఫీ చేసుకుని తాగిన రాహుల్‌గాంధీ.. వీడియో వైరల్

Rahulgandhi

Rahulgandhi

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఢిల్లీలోని పటేల్ నగర్‌ ప్రాంతంలోని కావెంటర్స్ షాపును సందర్శించారు. రాహుల్‌ రాకను గమనించి.. సిబ్బంది ఆహ్వానించారు. కాఫీ ఇవ్వాలని సిబ్బంది అడగగా.. రాహుల్‌గాంధీనే స్వయంగా తయారు చేసుకుని ఆస్వాదించారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: తిరుపతి ఘటనపై సీఎం సంచలన ప్రకటన.. వారిపై చర్యలు..

అనంతరం కావెంటర్స్ స్టోర్ సహా వ్యవస్థాపకులతో రాహుల్‌గాంధీ సంభాషించారు. ఈ బ్రాండ్ స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి మూలాలు ఉన్నాయి. దాదాపు 65 నగరాల్లో 200 దుకాణాలుగా అభివృద్ధి చెందింది. ఇంత పవర్‌ఫుల్‌గా ఎలా గ్రోత్ అయిందో వ్యవస్థాపకులు వివరించారు. అలాగే 100 ఏళ్ల కెవెంటర్స్ సహ వ్యవస్థాపకులు అమన్ అరోరా, అగస్త్య దాల్మియాతో కూడా రాహుల్ చర్చలు జరిపారు.

ఇది కూడా చదవండి: Shamshabad: దారుణం.. కోడలిని చంపి పాతిపెట్టిన అత్తమామలు

ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్‌గాంధీ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘కొత్త తరం, కొత్త మార్కెట్, లెగసీ బ్రాండ్, కెవెంటర్స్ యువ వ్యవస్థాపకులు తెలిపిన కొన్ని విలువైన సంభాషణలు పంచుకుంటున్నాను. కావెంటర్స్ వ్యాపారాలు ఆర్థిక వృద్ధికి దారి తీశాయి.’’ అంటూ రాహుల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్స్‌లో రాహుల్ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Show comments