Site icon NTV Telugu

Rahul Gandhi: చెల్లితో కలిసి రాహుల్‌గాంధీ బైక్ రైడింగ్

Priyankagandhi

Priyankagandhi

బీహార్‌లో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ సర్వేపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పెద్ద ఎత్తున విపక్షాలు నిరసనలు కొనసాగించారు.

ఇది కూడా చదవండి: Tawi Bridge: జమ్మూను ముంచెత్తిన భారీ వర్షాలు.. చూస్తుండగానే కూలిన తావి వంతెన.. షాకింగ్ వీడియో

తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. కొద్దిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ యాత్ర నిర్వహిస్తున్నారు. మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు యాత్రలో పాల్గొనగా.. బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెల్లి ప్రియాంకను బైక్‌పై ఎక్కించుకుని రాహుల్ గాంధీ రైడింగ్ చేశారు. కొద్దిసేపు ర్యాలీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోను కాంగ్రెస్‌ తమ ఎక్స్‌లో షేర్‌ చేసింది.

ఇది కూడా చదవండి: Delhi: గాజాలో జర్నలిస్టుల హత్యను ఖండించిన భారత్.. మృతులకు విదేశాంగ శాఖ సంతాపం

బైక్‌ ర్యాలీలో ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌, ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. ఆగస్టు 17న ప్రారంభమైన యాత్ర సెప్టెంబరు 1న ముగుస్తుంది. ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

 

Exit mobile version