NTV Telugu Site icon

NEET: నీట్‌పై వీడియో విడుదల చేసిన రాహుల్.. ఏం సందేశం ఇచ్చారంటే..!

Raehe

Raehe

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న సమయంలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి వీడియో విడుదల చేశారు. నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలపై మోడీ ప్రభుత్వంతో చర్చలు జరపడమే ఇండియా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభలో నీట్‌ అంశం మాట్లాడుతుండగా తన మైక్‌ కట్‌ చేశారని మండిపడ్డారు. నీట్‌ పేపర్ లీక్ గురించి అందరికీ తెలుసన్నారు. విద్యార్థులకు నష్టం కలిగించి, కొందరు మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా చదువుతుంటారని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: Vodafone Idea: అన్ని ప్లాన్‌లపై ధరల పెంపు.. ఎంత శాతమంటే..!

ఏడేళ్లలో 70సార్లు పలు పరీక్షల ప్రశ్న పేపర్‌లు లీక్‌ అయ్యాయని, లీకుల కారణంగా రెండు కోట్ల మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారని రాహుల్‌ విమర్శించారు. దీనికి పరిష్కారం చూపాలని విద్యార్థులు ప్రధాని మోడీని కోరుతున్నా ఆయన మౌనం వీడట్లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. విద్యార్థుల తరపున పోరాడతామని ప్రతిపక్ష నేత హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: సీఎం చంద్రబాబుతో మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..