NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్ గాంధీ సంచలన ప్రెస్ మీట్.. ప్రధాని మోదీకి ప్రశ్నల వర్షం..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: పరువునష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష, పార్లమెంట్ సభ్యుడిగా అనర్హత పడిన తర్వాత రాహుల్ గాంధీ ఈ రోజు మాట్లాడారు. డిస్ క్వాలిఫై చేసినా, జైలులో పెట్టిన భయపడనని, నేను భారత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాని, తాను సత్యాన్నే మాట్లాడుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆయన అన్నారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ.20,000 కోట్లు ఎవరు పెట్టుబడుతు పెట్టారని ప్రశ్నించారు. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ షెల్ కంపెనీల్లో కొన్ని డిఫెన్స్ సంస్థలు ఉన్నాయని, ఎందుకు డిఫెన్స్ అథారిటీ ప్రశ్నించడం లేదని అడిగారు. ప్రధాని, బీజేపీ వ్యక్తులు అదానీని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు.

Read Also: Bandi sanjay son: యూనివర్సిటీ సస్పెన్షన్ పై హైకోర్టుకు బండి సంజయ్ కుమారుడు

నరేంద్రమోదీ, గౌతమ్ అదానీల స్నేహం గురించి చెప్పాలని, మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకే విమానంలో ప్రయాణించిన విషయాన్ని ప్రస్తావించారు. అదానీ కోసం ఎయిర్ పోర్టు రూల్స్ నే మార్చారని ఆరోపించారు. అదానీ, మోదీల స్నేహం గురించి తాను పార్లమెంట్ లో మాట్లాడానని రాహుల్ గాంధీ అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు.

తాను పార్లమెంట్ లో చేసిన ప్రసంగాన్ని రద్దు చేశారని, దీని తర్వాత లోక్ సభ స్పీకర్ కు వివరణాత్మక సమధానం ఇచ్చినట్లు రాహుల్ గాంధీ చెప్పారు. కేంద్రమంత్రులు పార్లమెంట్ లో అబద్దాలు చెప్పారని, విదేశీ శక్తుల నుంచి సహాయం కోరానని ఆరోపించారని కానీ అవేవీ తాను చేయలేదని రాహుల్ గాంధీ అన్నారు. నేను ప్రశ్నించడం ఆపనని స్పష్టం చేశారు. రెండు పేజీల లేక లోక్ సభ స్పీకర్ కు రాస్తే జవాబే లేదని అన్నారు. స్పీకర్ ని కలిసి మాట్లాడేందుకు సమయం ఇవ్వాలంటే స్పీకర్ నవ్వి వదిలేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కోర్టు ఇచ్చిన తీర్పుపై తాను మాట్లాడనని అన్నారు.

Show comments