NTV Telugu Site icon

Rahul Gandhi: ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా మైక్ కట్.. ఎక్స్‌లో వీడియో షేర్

Rahe

Rahe

నీట్ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పేపర్ లీకేజ్‌పై చర్చ జరపాలని శుక్రవారం విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభ సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది.

ఇది కూడా చదవండి: Darshan : దర్శన్ హిస్టరీ తెలిసి కూడా నువ్విలా మాట్లాడుతున్నావా నాగశౌర్యా?

ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంపై ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతుండగా మైక్‌ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈమేరకు ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్‌ చేసింది. మైక్రోఫోన్‌లో మాట్లాడేందుకు వీలు కల్పించాలంటూ స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ కోరడం వీడియోలో కనిపిస్తోంది. నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోడీ ఏం మాట్లాడడం లేదని.. యువత తరపున రాహుల్ తన గొంతు వినిపిస్తు్న్నారని.. అలాంటి సమయంలో మైక్ ఆఫ్ చేయడం చౌకబారు పనులకు పాల్పడుతోందని కాంగ్రెస్ ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. కాంగ్రెస్ ఆరోపణలపై స్పీకర్ స్పందిస్తూ.. తాను ఎంపీల మైక్రోఫోన్ స్విచ్చాఫ్‌ చేయనని, అలాంటి నియంత్రణ ఏదీ తన దగ్గర లేదని స్పష్టంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగాల్సిన సమయంలో ఇతర విషయాలు రికార్డు కావని వెల్లడించారు. అయితే ముందు నీట్ వ్యవహారంపై చర్చ జరగాలని రాహుల్ డిమాండ్ చేశారు. అయితే ముందుగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని మాత్రమే అంగీకరిస్తానని స్పీకర్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Stock market: వరుస రికార్డులకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్