Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్

  • కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై రాహుల్ గాంధీ విమర్శలు.
  • ‘కౌగిలించుకోవడమే విదేశాంగ విధానం’ అంటూ మోదీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు.
  • ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రస్తావన తెస్తూ కామెంట్స్..
Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: న్యూఢిల్లీలోని మావలాంకర్ హాల్‌లో గురువారం జరిగిన కాంగ్రెస్‌ క్రియేటివ్ కాంగ్రెస్ కన్వెన్షన్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై విమర్శలు గుప్పించారు. విదేశాంగ విధానం అంటే కేవలం ఇతర దేశఆల నేతల్ని కౌగిలించుకోవడం కాదంటూ సైటైర్లు వేశారు. విదేశాంగ విధానంపై మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను వేదికపైకి పిలిచి కౌగిలించుకున్నారు. ‘‘కౌగిలించుకోవడమే విదేశాంగ విధానం అని ఆయన అనుకుంటున్నారు’’ అని ప్రధాని మోడీపై విమర్శలు చేశారు.

ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ రాహుల్ గాంధీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రస్తావన తేవడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. సందీప్ దీక్షిత్ రాహుల్ గాంధీతో ‘‘మీరు నన్ను మెలోనీ అనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించడంతో అక్కడ ఉన్నవారంతా నవ్వారు. వెంటనే ‘‘లేదు, లేదు, నేను ఇంకా ఆస్థాయికి చేరుకోలేదు’’ అని రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.