Site icon NTV Telugu

Rahul Gandhi: ఇండోర్‌లో అతిసార బాధిత కుటుంబాలకు రాహుల్‌గాంధీ పరామర్శ

Rahulgandhi

Rahulgandhi

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇండోర్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల భగీరథపురలో కలుషిత నీరు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇది కూడా చదవండి: Reena Paswan: రాజ్యసభకు కేంద్రమంత్రి తల్లి? ఏ రాష్ట్రం నుంచంటే..!

శనివారం రాహుల్ గాంధీ భగీరథపురంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. గాంధీ బాంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి ఓదార్చారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలుషిత నీరు కారణంగా చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు చికిత్స అందిస్తు్న్నారు.

ఇక రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందుస్తు చర్యగా పోలీసులు మోహరించారు. అంతకముందు ఎయిర్‌పోర్టులో రాహుల్ గాంధీకి ఘనస్వాగతం లభించింది. కాంగ్రెస్ నేతలు విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు.

 

 

Exit mobile version