Site icon NTV Telugu

Rahul Gandhi: కాశ్మీర్‌లో యుద్ధ బాధిత కుటుంబాలకు రాహుల్‌గాంధీ పరామర్శ

Rahulgandhi2

Rahulgandhi2

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సందర్భంగా పూంఛ్‌ ప్రాంతంలో ఆస్తులు కోల్పోయిన బాధిత కుటుంబాలను రాహుల్‌గాంధీ పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి: Minister Kandula Durgesh: పవన్ కల్యాణ్‌ సినిమా రిలీజ్ సమయంలోనే బంద్‌ ఎందుకు..?

దాయాది దేశం సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దాయాది సైనిక చర్యలకు జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలు దెబ్బతిన్నాయి. దీంతో పూంఛ్‌ ప్రాంతంలో అనేక నివాసాలు దెబ్బతిన్నాయి. ఒక పాఠశాలకు రాహుల్‌‌గాంధీ వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత జమ్మూకాశ్మీర్‌ను సందర్శించారు. ఇక ఆపరేషన్ సిందూర్ తర్వాత మరొకసారి ఈ ప్రాంతాన్ని సందర్శించడం విశేషం.

ఇది కూడా చదవండి: Seethakka: కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే కావొచ్చు..

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో పాకిస్థాన్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక పాకిస్థాన్‌కు సింధు జలాలను భారత్ నిలిపివేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుండడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది.

రాహుల్‌కు నాన్‌బెయిల్‌బుల్
ఇదిలా ఉంటే శనివారం రాహుల్‌గాంధీకి భారీ షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయన చిక్కుల్లో పడ్డారు. జార్ఖండ్‌లోని చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్‌గాంధీకి నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26న కోర్టు ముందు స్వయంగా హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. పదే పదే విచారణకు హాజరుకాకపోవడంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.

 

Exit mobile version