NTV Telugu Site icon

Bihar BJP chief: “బిన్ లాడెన్ లాగా గడ్డం పెంచుకుంటారు”.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

Rahul Gandhi

Rahul Gandhi

Bihar BJP chief: బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీని ఆల్ ఖైదా నేత, మరణించిన ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ తో పోల్చాడు. రాహుల్ గాంధీ బిన్ లాడెన్ లాగా గడ్డం పెంచుకుంటారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీలా కావాలని అనుకుంటున్నారని ఆయన శుక్రవారం అన్నారు. బీహార్‌లోని అరారియాలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Gujarat: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు.. మహిళతో సహా నలుగురి అరెస్ట్..

గతేడాది సెప్టెంబర్ లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ప్రారంభించింది. ఆ యాత్రలో రాహుల్ గాంధీ పెద్ద గడ్డంతో కనిపించారు. దీన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో సద్దాం హుస్సేన్ లా ఉన్నారంటూ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మ కూడా విమర్శించారు.

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మానసిన స్థితి బాగా లేదని సామ్రాట్ చౌదరి విమర్శించారు. నితీష్ కుమార్ దేశమంతా తిరుగుతున్నారని, ప్రతీ ఒక్కరికీ తాను దేశానికి ప్రధాని అని చెప్పుకుంటున్నారని, నితీష్ కుమార్ ప్రధానినా..? అని ఆయన ప్రశ్నించారు. అతను మానసికంగా బాగా లేదని ఆయన ఎద్దేవా చేశారు. విపక్షాల ఐక్యతలో ప్రధాని అభ్యర్థిని నిర్ణయించలేకపోవడాన్ని బీజేపీ నేత ప్రశ్నించారు. నితీష్ కుమార్ పరిస్థితి ‘గజినీ’ సినిమాలో అమీర్ ఖాన్ లా తయారైందని ఎద్దేవా చేశారు.