Site icon NTV Telugu

Rahul Gandhi : ఎమోషనల్‌ ట్వీట్‌.. నాన్నను మిస్సవుతున్నా..

Rahul Gandhi Rajiv Gandhi

Rahul Gandhi Rajiv Gandhi

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్థంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని వీరభూమిలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నివాళులర్పించారు. వీరితో పాటు నేతలు పి.చిదంబరం, సచిన్ పైలట్ కూడా మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి ఘటించారు. అయితే.. రాజీవ్‌ గాంధీ వర్థంతి నేపథ్యంలో ట్విట్టర్‌లో రాహుల్‌ గాంధీ ఎమోషనల్‌ ట్వీట్‌ పోస్ట్‌ చేశారు. ‘మా నాన్న దూరదృష్టి గల నాయకుడు.. ఆయన విధానాలు ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో సహాయపడ్డాయి. అతను కరుణ మరియు దయగల వ్యక్తి మరియు నాకు, ప్రియాంకకు అద్భుతమైన తండ్రి, క్షమాపణ మరియు సానుభూతి యొక్క విలువను మాకు నేర్పించారు. నేను నాన్నను చాలా మిస్ అవుతున్నాను మరియు మేము కలిసి గడిపిన సమయాన్ని ప్రేమగా గుర్తుంచుకుంటాను.’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

Exit mobile version