Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు

  • CEC జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
  • ‘‘దేశద్రోహి’’ అంటూ జ్ఞానేశ్ కుమార్‌పై ఘాటు వ్యాఖ్యలు
  • CEC వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్
  • భారత ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని రాహుల్ ఆరోపణ
Rahul Gandhi (1)

Rahul Gandhi (1)

Rahul Gandhi: ఎన్నికల సంఘం విధివిధానాలపై గత 10 నెలల్లో ఇద్దరు కమిషనర్లు 14 సార్లు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక వెలువడంతో రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ విషయంపై గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను దేశద్రోహిగా అభివర్ణిస్తూ.. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఓట్ల చోరీతో ప్రజాస్వామ్యం బలహీనమవుతోందని, నియంతృత్వం ఉన్న చోట అధికార వ్యతిరేకత ఉండదని, దేశ రాజ్యాంగం నాశనం అవుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను ఊరికే ఆరోపణలు చేయడం లేదని, సాక్ష్యాధారాలతో నిరూపించానని ఆయన అన్నారు. ఎన్నికల్లో 100 శాతం అక్రమాలు జరిగాయని ఆరోపించారు. జ్ఞానేష్ కుమార్ కుట్రదారుల్లో అగ్రస్థానంలో ఉన్నారని, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా ఆయనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, ఇప్పుడు తాను కూడా లేవనెత్తుతున్నానని వ్యాఖ్యానించారు.

సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ఆయన దేశానికి విరుద్ధంగా పనిచేశారని, మా వద్ద దీనికి సంబంధించిన సమాచారం ఉందని, ఫలితాలు త్వరలోనే వెలువడుతాయని అన్నారు. రాబోయే ఆరు నెలల్లో మరింత స్పష్టంగా వివరాలు తెలుస్తాయని అన్నారు.