Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ‘కుల వివక్ష’పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దేశంలో దళితులపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతుందని ఆరోపించారు. టీ దుకాణాల్లో దళితుల కోసం ప్రత్యేకంగా వేరే రకాల కప్పులు వాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్ పర్యటన తర్వాత ఆయన ప్రసంగించిన ప్రదేశాన్ని ‘‘శుద్ధి’’ చేశారని రాహుల్ ఆరోపించారు.
ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికీ దళితులపై వివక్ష కొనసాగుతోందని, టీ దుకాణాల్లో రెండు రకాల కప్పులు ఉంటాయని, దళితుల కోసం ప్రత్యేక కప్పులు ఉంచుతున్నారని, ఖర్గే ప్రసంగం చేసిన ప్రదేశాన్ని శుద్ధి చేశారని అన్నారు. ఖర్గే కార్యక్రమం తర్వాత శుద్ధీకరణ చేయడాన్ని రాహుల్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఘటన ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించడంమే అని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆయన అన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ తాను ప్రతీ కులానికి, మొత్తం భారతదేశానికి ప్రధానినని చెబుతున్నారని, కానీ ఆయన తన పార్టీ నేతల శుద్దీకరణ ఘటనకు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోందని ఆరోపించారు. ఖర్గేకు న్యాయం జరిగేలా చూడటం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. బీజేపీ సంస్థాగత నిర్మాణంపై వ్యాఖ్యానిస్తూ.. దానిపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని, బీజేపీ సంస్థాగత నిర్మాణం, కొత్త నిర్మాణం తనకు ఒకటేనని చెప్పారు.
Rahul Gandhi –
"Two types of cups are used in Indian tea shops.
Disposable Paper Cups : For DALITS
Reusable : For others"-> I don't like Tea or Milk but I think everyone in India prefers disposable paper cups over Glass cups. What Rahul is saying?
— News Algebra (@NewsAlgebraIND) August 29, 2026

