NTV Telugu Site icon

Rahul Gandhi: తెల్లవారు జామున ఆజాద్‌పుర్‌ మండిలో రాహుల్‌ గాంధీ.. కూరగాయలు, పండ్ల వ్యాపారులతో మాటా మంతీ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాందీ ఈ మధ్య కాలంలో సాధారణ ప్రజానీకంతో కలిసి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న విషయం చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం ట్రక్ డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడం కోసం వారితో సుమారు 2 గంటల పాటు లారీలో ప్రయాణం చేశారు. తరువాత హర్యానాలో రైతులతో మాట్లాడి.. పొలంలో ట్రాక్టర్‌తో పొలం దున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని కరన్‌బాగ్‌లోని మెకానిక్‌లను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌ అయిన ఆజాద్‌పుర్‌ మండిలో రాహుల్ గాంధీ పర్యటించారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఢిల్లీలోని ఆజాద్‌పుర్‌ మండికి వెళ్లారు. అక్కడ కూరగాయలు, పండ్ల వ్యాపారులు, స్థానికులతో రాహుల్‌ ముచ్చటించారు. కూరగాయల ధరలపై రాహుల్‌ వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత శనివారం తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో రాహుల్‌ గాంధీ ఆజాద్‌పుర్‌ మార్కెట్‌కు సంబంధించిన ఓ వీడియోను పంచుకున్న తర్వాత ఈ ఆకస్మిక పర్యటన చోటు చేసుకోవడం విశేషం. ఆ వీడియోలో ఓ వ్యక్తి కన్నీటి పర్యంతమైన దృశ్యం కనిపిస్తోంది.

Read also: TS High Court: తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నష్టంపై హైకోర్టులో విచారణ

ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ వారితో మాట్లాడుతూ .. దేశాన్ని రెండు వర్గాలుగా చీల్చారు. ఒకవైపు అధికారాన్ని కాపాడుకునేవాళ్లు. మరోవైపు సాధారణ వ్యక్తి. ఎవరి సలహాలతో దేశ విధానాలను రూపొందిస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పేద, ధనిక వర్గాల మధ్య తారతమ్యం లేకుండా చూడాలి.. సామాన్యుల కన్నీళ్లను తుడవాలని రాహుల్‌ పేర్కొన్నారు. ఇటీవల రాహుల్‌ గాంధీ హరియాణాలోని సోనిపత్‌ రైతులతో సమావేశమైన విషయం తెలిసిందే. మదీనా గ్రామంలో రాహుల్ పొలంలో ట్రాక్టర్‌తో దున్నారు. ఆ తర్వాత కూలీలతో కలిసి నాటు వేసి, వారితో కలిసి భోజనం చేశారు. అదేవిధంగా ఢిల్లీలోని కరన్‌బాగ్‌లో మెకానిక్‌లను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. తాజాగా ఇప్పుడు ఆజాద్‌పుర్‌ మండికి వెళ్లి అక్కడ కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.