Racist Attack on Indian: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులు తీవ్రమైన అవమానాలు, దాడులకు గురైతున్న సంఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చదువు కోవడానికి ఆ దేశానికి వెళ్లిన యువతపై జాత్యహంకార దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చదువు కోసం తమ భవిష్యత్తును పణంగా పెట్టి వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ భద్రత లేని వాతావరణంలో జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ఇటీవల మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్ లాంటి నగరాల్లో ఇండియన్ స్టూడెంట్స్ పై జరిగిన దాడులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విద్యార్థులపై నేరుగా దాడి చేయడం, అపహాస్యం చేయడం, వారి ఆస్తులను నాశనం చేయడం కనిపిస్తుంది.
Read Also: IND vs ENG: భారత్.. ఊపిరి పీల్చుకో, ఆడు బ్యాటింగ్‌కు వచ్చేస్తున్నాడు!
ఇక, ఈరోజు మెల్‌బోర్న్‌లో మరో భారతీయుడిపై గుర్తు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఓ షాపింగ్ సెంటర్ బయట సౌరభ్ ఆనంద్‌పై దాడికి దిగారు. తుపాకులు, కత్తులతో ఐదుగురు యువకులు దాడి చేయగా.. ఈ ఘటనలో సౌరభ్ ఆనంద్ వెన్నెముక, భుజం విరిగిపోయాయి.. దీంతో అతడ్ని అక్కడి స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, స్థానిక యువకులు విదేశీ విద్యార్థులపై అక్కసుతో దాడులకు పాల్పడుతున్నారని అక్కడి ప్రవాస భారతీయులు ఆరోపిస్తున్నారు. దాడుల సంఖ్య పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఇండియన్ స్టూడెంట్స్ భద్రతపై ఆసీస్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
