Site icon NTV Telugu

Tejashwi Yadav: కొత్త మనవడికి పేరు పెట్టిన రబ్రీ దేవి.. అర్థమిదే!

Lalurabri

Lalurabri

బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. మంగళవారం తన భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చిందని తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మగ శిశువు ఫొటోను కూడా పంచుకున్నారు. చిన్నారి రాకను ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: Mock Drill: రేపు పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్.. భారత్ కొత్త ఆపరేషన్‌కు ప్లాన్ చేస్తోందా?

తాజాగా మనవడిని లాలూ ప్రసాద్ యాదవ్-రబ్రీ దేవి సందర్శించారు. మనవడి రాకతో రాజకీయ కురువృద్ధులు ఆనందం వ్యక్తం చేశారు. మనవడిని దర్శించిన అనంతరం మీడియాకు పేరును వెల్లడించారు. కొత్త మనవడికి ‘ఇరాజ్ లాలూ యాదవ్’గా పేరు నామకరణం చేసినట్లుగా లాలూ-రబ్రీ దంపతులు ప్రకటించారు. ఇరాజ్ లాలూ యాదవ్ రాకతో తమ కుటుంబం ఆనందంగా ఉందని తెలిపారు. బీహార్‌లోని యాదవ్ కుటుంబమంతా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Sandeep vs Deepika: స్పిరిట్ పంచాయతీలో తప్పెవరిది? బలైంది ఎవరు?

పేరుకి అర్థమిదే?
ఇరాజ్ అనే పేరు సంస్కృతంలో వివిధ అర్థాలను కలిగి ఉంది. హనుమంతుడికి మరొక పేరు పువ్వు, ఆనందానికి చిహ్నం, నీటి నుంచి పుట్టిన వ్యక్తి లేదా కామదేవుడిని ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఇరాజ్‌కు ఆనందం అని అర్థం సూచిస్తుంది.

తేజస్వి యాదవ్.. లాలూ ప్రసాద్ యాదవ్-రబ్రీ దేవిల చిన్న కుమారుడు. తేజస్వి యాదవ్ మొదటి సంతానం 2023లో నవరాత్రి సమయంలో జన్మించింది. ఆ చిన్నారికి కాత్యాయని అని పేరు పెట్టారు. తేజస్వి యాదవ్‌కు 2021లో పెళ్లైంది. చిరకాల స్నేహితురాలు రాచెల్ గోడిన్హోను వివాహం చేసుకున్నారు. 2021, డిసెంబర్‌లో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. తేజస్వి-రాచెల్ గోడిన్హో న్యూఢిల్లీలోని ఆర్కేపురంలో డీపీఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. అలా చిన్ననాటి స్నేహితురాలిని తేజస్వి యాదవ్ మనువాడారు.

ప్రస్తుతం తేజస్వి యాదవ్ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ బాధ్యతలు మీద వేసుకుని ముందుండి పార్టీని నడిపిస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఆశ పడుతున్నారు.

Exit mobile version