NTV Telugu Site icon

Rabies Deaths: దేశంలో పెరిగిన ‘‘రేబిస్’’ మరణాలు.. కుక్క కాటుతో ప్రతీ నెల నలుగురు మృతి

Dog Bites

Dog Bites

Rabies Deaths: భారతదేశంలో ‘‘రేబిస్ వ్యాధి’’ వల్ల మరణాలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక నివేదికలో.. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 36 శాతం మరణాలు ఇండియాలోనే ఉంటున్నాయని చెప్పింది. అధికారిక గణాంకాల పరిశీలిస్తే.. దేశంలో నివేదించబడిన రేబిస్ కేసులు, మరణాలలో దాదాపుగా 30-60 శాతం 15 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలే ఎక్కుగా ఉంటున్నారని తేలింది. చాలా వరకు వీటిని పిల్లలు నివేదించకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నట్లు చెప్పింది.

2024 క్యాలెండర్ ఇయర్‌లో 5.19 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి, వీటిలో బాధితులు 15 కన్నా తక్కువ వయసు ఉన్నవారు ఎక్కువ. దేశంలో రేబిస్ వ్యాధికి కారణం.. జనావాసాల్లో టీకాలు వేయని వీధి కుక్కలు గణనీయంగా ఉండటమే అని ప్రభుత్వం చెబుతోంది. భారతదేశంలో 2030 నాటికి రేబిస్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచనను అనుసరించి, 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు రేబిస్‌ని గుర్తించదగిన వ్యాధిగా వర్గీకరించారు.

Read Also: Punjab: అమృత్‌సర్ ఆలయంపై బాంబు దాడి.. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం..

దేవంలో కుక్క కాటు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, 2024లో రేబిస్ వ్యాధి కేసుల సంక్యల గణనీయంగా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. 2022లో దేశవ్యాప్తంగా, 21.80 లక్షల కుక్కకాటు కేసులు నమోదైతే, రేబిస్ కారణంగా 21 మంది మరణించారు. ఇదే 2024 విషయానికి వస్తే 21.95 లక్షల కేసులు నమోదైతే, రేబిస్ వల్ల మరణించిన వారి సంఖ్య 54కి పెరిగింది. 2023లో కుక్క కాటు కేసులు 30.43 లక్షలు కాగా, రేబిస్ వల్ల 50 మంది మరణించారు.

రేబిస్ కారణంగా నెలకు సగటున 4 మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో మహారాష్ట్ర నుంచి ఒకటి ఉంటుందని డేటా చూపిస్తోంది. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2022లో 21 మరణాలు సంభవిస్తే , 2024 నాటికి 54కి చేరాయి. రేబిస్ మరణాలు 2.5 రెట్లు పెరిగాయని నివేదిక చెబుతోంది.