NTV Telugu Site icon

Bengaluru Techie Missing: ‘‘మీరు జైలులో పెట్టినా మంచిదే, నా భార్య వద్దకు మాత్రం వెళ్లను’’..

Vipin Gupta Missing

Vipin Gupta Missing

Bengaluru Techie Missing: ఇటీవల బెంగళూర్‌కి చెందిన టెక్కీ 37 ఏల్ల విపిన్ గుప్తా కనిపించకుండా పోయాడు. ఆ కేసు ఆ రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన భర్తను కనుగొనాలని భార్య సోషల్ మీడియాలో ఏడుస్తూ సాయం కోరడం చర్చనీయాంశంగా మారింది. విపిన్ గుప్తా మిస్సింగ్‌పై ఆమె బెంగళూర్‌లోని కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదు చేసింది.

చివరకు మహిళ భర్త విపిన్ గుప్తా పోలీసులకు చిక్కాడు. నోయిడాలో ఓ షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తున్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. అయితే, కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనని గుర్తించకుండా విపిన్ గుప్తా తన రూపురేఖలు మార్చుకునేందుకు గుండు కొట్టించుకున్నాడు. బెంగళూర్ నుంచి వెళ్లిపోయాయ ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. అయితే, కొత్త సిమ్ కొనుగోలు చేసి ఆ ఫోన్‌లో వేయడంతో అతడిని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు.

మొదట్లో బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టు్ల్లోని సీసీటీవీ ఫుటేజీలను చూసిన అతడిని కనుగొనలేకపోయారు. దాదాపుగా 10 రోజుల తర్వాత బుధవారం అతని ఆచూకీని గుర్తించారు. ముందుగా మాల్ వెలుపల సివిల్ డ్రెస్సుల్లో ఉన్న పోలీసులు విపిన్‌ని చుట్టుముట్టారు. పోలీసులని గుర్తించిన విపిన్ ఒక నవ్వు నవ్వి తర్వాత ఏంటని ప్రశ్నించినట్లు ఓ అధికారి చెప్పారు. తమతో బెంగళూర్ రావాలని అతని కోరామని, ఇందుకు అతను తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెప్పారు. చాలా గంటల మాట్లాడి ఒప్పించిన తర్వాత విపిన్ అయిష్టంగానే బెంగళూర్ వచ్చాడు.

Read Also: Polavaram Project Files: పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం.. స్పెషల్ కలెక్టర్ ఏం చెప్పారంటే..?

అయితే, పోలీసులతో తన బాధను పంచుకున్న తీరు ప్రస్తుతం హైలెట్ అవుతోంది. ‘‘మీరు నన్ను జైలులో పెట్టినా ఉంటానున, కానీ నేను తిరిగి రాను’’ అని అధికారులకు పదేపదే చెప్పినట్లు సమాచారం. శుక్రవారం బెంగళూర్ కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి ఇంటికి వెళ్లేందుకు విపిన్‌ని అనుమతించారు. తాను తీవ్రమైన కుటుంబ సమస్యల్ని ఎదుర్కొన్నట్లు చెప్పాడు. తనపై తన భార్య నియంత్రణ ఎక్కువైనట్లు వివరించాడు. చిన్నచిన్న సమస్యలకు కూడా విమర్శలకు గురయ్యేవాడినని చెప్పాడు. తన వ్యక్తిగత స్వేచ్ఛని తన భార్య పరిమితం చేసిందని ఆరోపించాడు.

‘‘నేను ఆమెకు రెండో భర్తని, నేను ఆమెని మూడేళ్ల క్రితం కలిసినప్పుడు ఆమెకు అప్పటికే 12 ఏళ్ల కుమార్తె ఉంది. అయినా కూడా ఆమెని వివాహం చేసుకునేందుకు అంగీకరించాను. మాకు 8 నెలల కుమార్తె ఉంది. ఆమె నా స్వేచ్ఛని హరిస్తుంది. నా ప్లేట్ నుంచి ఒక్క అన్నం మెతుకు, చపాతీ ముక్క కిందపడిపోయినా అరుస్తుంది. నేను ఆమెకు నచ్చినట్లు బట్టలు వేసుకోవాలి. నేను చివరికి టీ తాగడానికి కూడా ఒంటరిగి వెళ్లలేను’’ అని పోలీసులకు చెప్పాడు. అతను బెంగళూర్ వదిలిన తర్వాత తిరుపతి, భువనేశ్వర్, ఢిల్లీ, నోయిడా వెళ్లినట్లు చెప్పాడు.