NTV Telugu Site icon

సామాన్య కార్యకర్తకు సీఎం పీఠం-పుష్కర్‌సింగ్‌ ధామి

Pushkar

Pushkar

నాలుగు నెలల్లో ముగ్గురు సీఎంలు మారిన పరిస్థితి.. రెండో సీఎం రాజీనామా చేయడంతో.. మూడో సీఎం ఎవరు అనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో.. ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామిని ఎన్నుకుది బీజేపీ శాసనసభాపక్ష సమావేశం.. నిన్న తీరథ్‌సింగ్ రావత్ రాజీనామా చేయడంతో సీఎం పదవి ఖాళీ అయ్యింది.. అయితే, ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పుష్కర్‌ సింగ్‌ ధామిని ఎన్నుకుంది.. డెహ్రాడూన్‌ లో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారల ఇంఛార్జ్ నరేంద్రసింగ్‌ తోమర్ సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.. ఇక, అనంతరం మీడియాతో మాట్లాడిన కొత్త ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి.. భార‌తీయ జ‌న‌తాపార్టీ ఒక సాధార‌ణ కార్యక‌ర్తకు ముఖ్యమంత్రి పీఠం క‌ట్టబెట్టిందన్నారు.. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వంలో అంద‌రం క‌లిసిక‌ట్టుగా ప‌నిచేస్తామన్న ఆయన.. సీఎంగా ప‌నిచేసేందుకు తనకు ఏడాది కూడా స‌మ‌యం లేద‌ని, కానీ, ఈ త‌క్కువ కాలంలోనే అందరి సాయంతో ప్రజ‌ల‌కు మెరుగైన సేవ చేసేందుకు కృషి చేస్తానని.. తక్కువ సమయంలో.. ఇది చేయడం సవాలే అయినా.. ఆ సవాలును స్వీకరిస్తానని తెలిపారు. కాగా, పుస్క‌ర్ సింగ్ ధామి పితోగ‌ఢ్‌లో జ‌న్మించారు. ఆ త‌ర్వాత రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేసి రెండు సార్లు ఎమ్మ‌ల్యేగా గెలించారు. ఉద్ధ‌మ్‌సింగ్ న‌గ‌ర్ జిల్లాలోని ఖతిమా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.