NTV Telugu Site icon

నేడు పూరిలో జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌…భ‌క్తులు లేకుండానే…

విశ్వ‌విఖ్యాతి గాంచిన పూరి జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర ఈరోజు ప్రారంభం కాబోతున్న‌ది.  క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా ఈ ఏడాది కూడా భ‌క్తులు లేకుండానే ర‌థ‌యాత్ర జ‌రుగుతున్న‌ది.  సేవ‌కులు మాత్ర‌మే ఈ యాత్ర‌లో పాల్గొంటారు.  ర‌థ‌యాత్ర జ‌రుగుతుండ‌టంతో పూరీలో క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి.  రేపు రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కర్ఫ్యూ అమ‌లు జ‌రుగుతుంది. ఇత‌ర ప్రాంతాల నుంచి పూరీకి ఎవ‌ర్నీ అనుమ‌తించ‌డంలేదు.  పూరీలోని సామాన్య ప్ర‌జ‌లు, భ‌క్తులు ఎవ‌రైనా స‌రే ఈ కార్య‌క్ర‌మాన్ని టీవీల్లో లైవ్ ద్వారా చూసుకోవాల‌ని, ప్ర‌త్య‌క్షంగా ర‌థ‌యాత్ర‌లో పాల్గొన‌డానికి అనుమ‌తులు లేవ‌ని ఒడిశా స‌ర్కార్ స్ప‌ష్టంచేసింది.  అందుకు త‌గిన విధంగానే ఏర్పాట్ల‌ను చేసింది ఒడిశా స‌ర్కార్‌.  

Read: ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం ఆదేశం