ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సమక్షంలో కాషాయ గూటికి చేరారు. అధికారికంగా ముగ్గురు చేరగా.. మిగతా నలుగురు చేరుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనతో ఆప్ అధిష్టానం షాకైంది.
తాజాగా తిరుగుబావుటా ఎగరేసిన రాజ్యసభ ఎంపీలను ‘‘పంజాబ్ ద్రోహులు’’గా చిత్రీకరిస్తూ పంజాబ్‌లో పోస్టర్లు వెలిశాయి. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అధికారిక ఎక్స్‌లో ఎంపీలను ఆర్ఎస్ఎస్ కార్యకర్తల రూపంలో చిత్రీకరించి పోస్ట్ చేశారు. ఫొటోలో రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ ఉండగా.. స్వాతి మాలివాల్ మాత్రం కనిపించలేదు. కేవలం ఆరుగురు ఎంపీలు మాత్రమే కనిపించారు. మహిళ అని స్వాతి మాలివాల్‌ను వదిలేశారో.. మరేంటో తెలియదు.
ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది ఆప్ రాజ్యసభ ఎంపీలు ఉండగా.. ఏడుగురు తిరుగుబావుటా ఎగరేశారు. ముగ్గురు ఎంపీలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిశారు. ముగ్గురు స్వయంగా కలవగా.. మరో నలుగురు కూడా చేరుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో మండు వేసవిలో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలినట్లైంది. అన్హరత వేటు తప్పించుకునేందుకు 2/3 వంతు చీలికతో బీజేపీలో విలీనం అవుతున్నట్లుగా రాఘవ్ చద్దా ప్రకటించారు. ఇది ఆప్‌కు ఊహించని షాక్ తగిలినట్లైంది.
శుక్రవారం రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ బీజేపీ నేతలను కలవగా.. వారితో పాటు స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ కూడా బీజేపీ గూటికి చేరుతున్నారు.
