Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
- చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య
- అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
- రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య గుర్ప్రీత్ కౌర్ చిక్కుల్లో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ అత్యాచార కేసును మాఫీ చేసేందుకు గుర్ప్రీత్ కౌర్ రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లుగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. సీరియస్‌గా తీసుకున్న కమిషన్.. ఆరోపణలపై విచారణ జరిపి రెండు వారాల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ ఆరోపణలను రిటైర్డ్ పంజాబ్ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ బహిరంగంగా చేసినట్లు పేర్కొంటూ లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. అత్యాచారం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి భార్య పేరును ప్రస్తావిస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు రిటైర్డ్ న్యాయమూర్తి చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఈ ఆరోపణలపై స్వతంత్రంగా నిజానిజాలను నిర్ధారించాలని, ఆధారాలను భద్రపరచాలని, దర్యాప్తును ప్రభావితం చేయడానికి లేదా నీరుగార్చడానికి ఏదైనా ప్రయత్నం జరిగిందా అనే అంశంపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ఫిర్యాదుదారు కోరారు. బాధితురాలికి న్యాయం అందడం వ్యక్తుల హోదా, పలుకుబడి లేదా అధికారానికి అతీతంగా ఉండాలని ఎల్ఆర్వో (LRO) పేర్కొంది. ఈ ఆరోపణలు ప్రాథమికంగా బాధితురాలి మానవ హక్కులను ఉల్లంఘించే అంశంగా కనిపిస్తున్నాయని ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలి
ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేయాలని ఎన్హెచ్ఆర్సీ రిజిస్ట్రీని ఆదేశించింది. ఫిర్యాదులో చేసిన ఆరోపణలపై విచారణ జరిపి రెండు వారాల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను కమిషన్ పరిశీలనకు సమర్పించాలని ఆదేశించింది. అదే సమయంలో ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను న్యూఢిల్లీలోని కేంద్ర హోంశాఖ మహిళా భద్రత విభాగం జాయింట్ సెక్రటరీకి కూడా పంపాలని కమిషన్ సూచించింది. ప్రస్తుతం ఇవి ఫిర్యాదులో చేసిన ఆరోపణలు మాత్రమే. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు జరిగే విచారణలో ఆరోపణల వాస్తవికత తేలాల్సి ఉంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!