MLA Slapped by Her Husband: ఎమ్మెల్యేను చాచిపెట్టి కొట్టిన భర్త.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Slapped by Her Husband: మహిళలపై నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో రెండు రోజుల క్రితమే ఓ నివేదిక విడుదల చేసింది. పంజాబ్‌లో కూడా మహిళలపై నేరాలు 17 శాతం పెరిగినట్లు ఆ నివేదికలో వెల్లడైంది. ఆ నివేదికపై చర్చ జరుగుతుండగానే ఓ మహిళా ఎమ్మెల్యేపై ఆమె భర్త దాడి చేసిన ఘటన పంజాబ్‌లో జరిగింది. అందరూ చూస్తుండగానే పంజాబ్‌లో ఆప్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. ఆమె ఇంట్లో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్‌లోని తాల్వండి సాబో నియోజకవర్గ శాసనసభ్యురాలు బల్జిందర్ కౌర్.. ఆమె భర్త సుఖ్‌రాజ్ సింగ్ మధ్య ఏదో విషయంలో వాగ్వాదం చోటుచేసుకోగా.. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన ఆయన ఆమెపై చేయి చేసుకున్నారు. భార్యతో వాదులాడుతున్న ఎమ్మెల్యే భర్తను కొందరు పట్టుకుని దూరంగా తీసుకొచ్చారు. దీంతో పక్కనున్నవారు వెంటనే ఆయనను అక్కడినుంచి లోపలికి తీసుకెళ్లారు. జులై 10న ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ఈ వీడియోపై స్పందించారు. మహిళా ఎమ్మెల్యేపై చేయి చేసుకోవడం దిగ్భ్రాంతికరమన్నారు.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
INS Vikrant: ప్రధాని చేతులమీదుగా నౌకాదళంలోకి “ఐఎన్‌ఎస్ విక్రాంత్”
ఈ వైరల్ వీడియో పంజాబ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మనీషా గులాటి దృష్టిలో పడింది. దీనిని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడే ఓ మహిళ ఇంట్లో వేధింపులకు గురికావడం బాధాకరమని అన్నారు. పంజాబ్‌లోని మఝా ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ యూత్ విభాగ కన్వీనర్ అయిన సుఖ్‌రాజ్‌తో 2019లో బల్జిందర్ కౌర్‌కు వివాహమైంది. పాటియాలాలోని పంజాబ్ యూనివర్శిటీ నుంచి ఎంఫిల్ పూర్తిచేసిన కౌర్ రాజకీయాల్లోకి రాకముందు ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తాల్వండి సాబో నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Empowering women is not a deterrent to stop violence against women.Shocking to see @BaljinderKaur_ MLA getting slapped in broad day light.Mindset of men has to change.
The problem lies in the perpetrator’s of these acts.Change this male chauvinism attitude more then anything else pic.twitter.com/Qxm6rhrtht— Brinder (@brinderdhillon) September 1, 2022
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!