Site icon NTV Telugu

MLA Slapped by Her Husband: ఎమ్మెల్యేను చాచిపెట్టి కొట్టిన భర్త.. వీడియో వైరల్‌

Aap Mla

Aap Mla

MLA Slapped by Her Husband: మహిళలపై నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో రెండు రోజుల క్రితమే ఓ నివేదిక విడుదల చేసింది. పంజాబ్‌లో కూడా మహిళలపై నేరాలు 17 శాతం పెరిగినట్లు ఆ నివేదికలో వెల్లడైంది. ఆ నివేదికపై చర్చ జరుగుతుండగానే ఓ మహిళా ఎమ్మెల్యేపై ఆమె భర్త దాడి చేసిన ఘటన పంజాబ్‌లో జరిగింది. అందరూ చూస్తుండగానే పంజాబ్‌లో ఆప్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. ఆమె ఇంట్లో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్‌లోని తాల్వండి సాబో నియోజకవర్గ శాసనసభ్యురాలు బల్జిందర్ కౌర్.. ఆమె భర్త సుఖ్‌రాజ్ సింగ్ మధ్య ఏదో విషయంలో వాగ్వాదం చోటుచేసుకోగా.. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన ఆయన ఆమెపై చేయి చేసుకున్నారు. భార్యతో వాదులాడుతున్న ఎమ్మెల్యే భర్తను కొందరు పట్టుకుని దూరంగా తీసుకొచ్చారు. దీంతో పక్కనున్నవారు వెంటనే ఆయనను అక్కడినుంచి లోపలికి తీసుకెళ్లారు. జులై 10న ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ఈ వీడియోపై స్పందించారు. మహిళా ఎమ్మెల్యేపై చేయి చేసుకోవడం దిగ్భ్రాంతికరమన్నారు.

INS Vikrant: ప్రధాని చేతులమీదుగా నౌకాదళంలోకి “ఐఎన్‌ఎస్ విక్రాంత్”

ఈ వైరల్ వీడియో పంజాబ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మనీషా గులాటి దృష్టిలో పడింది. దీనిని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడే ఓ మహిళ ఇంట్లో వేధింపులకు గురికావడం బాధాకరమని అన్నారు. పంజాబ్‌లోని మఝా ప్రాంతంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ యూత్ విభాగ కన్వీనర్‌ అయిన సుఖ్‌రాజ్‌తో 2019లో బల్జిందర్ కౌర్‌కు వివాహమైంది. పాటియాలాలోని పంజాబ్‌ యూనివర్శిటీ నుంచి ఎంఫిల్‌ పూర్తిచేసిన కౌర్‌ రాజకీయాల్లోకి రాకముందు ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తాల్వండి సాబో నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

 

Exit mobile version