Ramleela play: రామయాణం ఇతిహాసం ఆధారంగా నాటకాన్ని ప్రదర్శిస్తూ.. అందులో పవిత్ర దేవీదేవతలను కించపరుస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు పూణే యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్, ఐదుగురు విద్యార్థులను శనివారం అరెస్ట్ చేశారు. నాటకంలో అసభ్యకరమైన సీన్లు, డైలాగ్స్ ఉన్నాయని, ఇందులో సీతాదేవీ పాత్రధారి సిగరేట్ తాగుతున్నట్లు చూపించారని ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీ కార్యకర్త హర్షవర్థన్ హర్పుడే ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 (A) మరియు ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Ashok Gehlot: మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌కి కోవిడ్, స్వైన్ ఫ్లూ.. ఆస్పత్రిలో చేరిక..
శుక్రవారం సాయంత్రం ప్రదర్శించిన ఈ నాటకంపై ఏబీవీపీ కార్యకర్తలు పూణే యూనివర్సిటీ లలిత కళా కేంద్రానికి చెందిన విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. నాటకంలో సీత పాత్రను పోషించిన నటుడు సిగరేట్ కాల్చడం, అసభ్యకరమైన పదజాలం వాడటం చిత్రీకరించబడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నాటకంపై ఏబీవీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాటకాన్ని నిలిపివేయాలని కోరారు అయితే, అందుకు ప్రదర్శన నిర్వహిస్తున్న వారు స్పందించకపోగా వారిపై దాడికి దిగినట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి లలిత కళా కేంద్రం విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్ భోలేతో పాటు విద్యార్థులు భవేష్ పాటిల్, జే పెడ్నేకర్, ప్రథమేష్ సావంత్, రిషికేష్ దాల్వీ, యశ్ చిఖ్లేలను పోలీసులు అరెస్ట్ చేశారు.
https://twitter.com/SanghiPablo1/status/1753641856758403084
