Site icon NTV Telugu

TVK Party: టీవీకే పార్టీకి షాక్.. పుదుచ్చేరి సభలో కేవలం లోకల్స్కి మాత్రమే అనుమతి

Vijay

Vijay

TVK Party: నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. పుదుచ్చేరిలో మంగళవారం (డిసెంబర్ 9న) నిర్వహించనున్న రాజకీయ సభకు ఆంక్షలు విధించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన జరిగిన కరూరు సభలో జరిగిన భారీ తొక్కిసలాట నేపథ్యంలో పోలీసులు కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. అయితే, ఉప్పాలంలో న్యూ పోర్ట్ ఎక్స్‌పో గ్రౌండ్‌లో జరగనున్న ఈ సభకు పుదుచ్చేరికి చెందిన ప్రజలకు మాత్రమే అనుమతి ఇవ్వబడింది అని వెల్లడించారు. అయితే, తమిళనాడు నుంచి ఎవరూ సభ స్థలికి రాకూడదని, ఒకవేళా వచ్చినా వారికి ప్రవేశం ఇవ్వడం కుదరదని పుదుచ్చేరి పోలీసులు స్పష్టం చేశారు.

Read Also: Telanagana: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై రాజకీయ రగడ !

అయితే, సభ ఉదయం 12:30 గంటలకు ముందే ముగించాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సభకు 5 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. TVK జారీ చేసిన QR కోడ్ కలిగిన పాస్ ఉన్న వారికే లోపలికి ప్రవేశం ఉంటుంది. పాస్ లేని వారు ప్రవేశం పొందలేరని హెచ్చరించారు. అంతేగాక, ప్రజలను నియంత్రించడానికి 500 మంది సామర్థ్యంతో వేర్వేరు ఎన్ క్లోజర్లు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు సభలో ప్రవేశం లేదన్నారు. కరూరు ఘటన లాంటిది మరోసారి పునరావృతం కాకుండా చూడడం తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.

Read Also: Sukumar: డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం కథను ఫస్ట్ ఇతనికే చెప్పాడు..

ఇక, టీవీకే సభ ప్రాంగణంలో తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్సులు, మెడికల్ టీమ్‌లు, ఫైర్ ఇంజిన్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు వంటి అన్ని భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని పుదుచ్చేరి పోలీసులు పేర్కొన్నారు. పార్కింగ్‌ను పొండి మరీనా, స్టేడియం వెనుక ప్రాంతం, ఓల్డ్ పోర్ట్ ఏరియా అనే మూడు ప్రాంతాలను మాత్రమే కేటాయించారు. టీవీకే కార్యకర్తలు రోడ్లపై వాహనాలు నిలపడం పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు.

Exit mobile version