మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు దేశం లోపల, బయట రచ్చకు కారణం అయ్యాయి. పలు ఇస్లామిక్ దేశాలు భారత్ కు తన నిరసన వ్యక్తం చేశాయి. అయితే భారత్ కూడా ఇదే స్థాయిలో వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించవద్దని సూచించింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా బీజేపీ నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
తన వ్యాఖ్యలపై నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పినా.. వివాదం ఇంకా సద్దుమణగలేదు. నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ.. ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది మతఛాందసవాదులు నుపుర్ శర్మను ఆమె కుటుంబాన్ని చంపుతామంటూ బెదిరిస్తున్నారు. ఇదే విధంగా మరో మాజీ బీజేపీ నేత నవీన్ జిందాల్ ను కూడా చంపుతామని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచాడు మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్. ఆమెకు మద్దతునిస్తూ ట్వీట్ చేశాడు. ‘‘క్షమాపణలు చెప్పిన మహిళకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ద్వేషం, మరణ బెదిరింపులు చేయడంపై ‘సెక్యులర్ లిబరల్స్’ అని పిలవబడే వారి మౌనం ఖచ్చితంగా చెవిటిది!’’ అంటూ ట్వీట్ చేశాడు. ఒక మహిళపై ఇంత ద్వేషం ప్రదర్శిస్తూ, భయపెడుతుంటే ఓ ఒక్క సెక్యులర్ లిబరల్స్ గా పిలుచుకునే మేధావులు స్పందించపోవడంపై గౌతం గంభీర్ ఈ ట్వీట్ చేసిటన్లు తెలుస్తోంది. దీంతో పాటు ‘‘ లెట్స్ టాలరేట్ ఇన్ టాలరెన్స్ హ్యాట్ ట్యాగ్ తో ఈ ట్వీట్ చేశాడు.
గౌతం గంభీర్ తో పాటు ఇంతకుముందు బీజేపీ నేత కపిల్ మిశ్రా, జిల్లా స్థాయి నేతలు బహిరంగంగా శర్మకు మద్దతు తెలిపారు. బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ ‘నిజం చెప్పడం తిరుగుబాటు అయితే, నేను కూడా రెబల్‌నే’ అని ట్వీట్ చేశారు. కంగనా రనౌత్ కూడా నుపుర్ శర్మకు మద్దతు తెలిపింది.
Silence of so called ‘secular liberals’ on the sickening display of hatred & death threats throughout the country against a woman who has apologised is surely DEAFENING! #LetsTolerateIntolerance
— Gautam Gambhir (@GautamGambhir) June 12, 2022
