NTV Telugu Site icon

Chhattisgarh: బ్యాంక్ మేనేజర్ కక్కుర్తి.. లోన్ ఇప్పిస్తానని రూ.39 వేల చికెన్ ఫుడ్ ఆరగించిన ఘనుడు

Chicken

Chicken

బ్యాంక్‌లు అనేవి కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలి. అవకాశం ఉంటే రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలి. సహజంగా బ్యాంకులు-కస్టమర్ల మధ్య ఇలాంటి సంబంధాలే ఉంటాయి. అయితే ఓ బ్యాంక్ మేనేజర్.. లోన్ ఆశ జూపి ఓ కస్టమర్ దగ్గర నాటుకోళ్లను నొక్కేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Rajendra Prasad: వాడెవడో చందనం దొంగ.. వాడు హీరోనా?..పుష్ప 2పై రాజేంద్ర ప్రసాద్ సంచలనం

రూపచంద్ మన్హర్ అనే రైతు తన పొలంలో కోళ్లను పెంచుతున్నాడు. తన వ్యాపారిని మరింత వృద్ధి చేసుకునేందుకు మస్తూరిలోని ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్‌ను కలిసి రూ.12 లక్షల రుణాన్ని కోరాడు. అందుకు మేనేజర్ కూడా ఒకే చెప్పాడు. దీంతో రైతు ఆనందంతో మురిసిపోయాడు. కానీ ఆ తర్వాత మేనేజర్ పాడు బుద్ధి బయటపడింది. రుణం ఇస్తానంటూ.. ఊరులోంచి నాటు కోళ్లు తీసుకు రమ్మని చెప్పాడు. ఇలా ప్రతి శనివారం కోళ్లు తీసుకెళ్తూ ఉండేవాడు. పాపం లోన్ వస్తుందన్న ఆశతో రైతు కూడా పలుమార్లు కోళ్లు తీసుకెళ్తూ ఉండేవాడు. కానీ ఎన్ని రోజులైనా రుణం మాత్రం రాలేదు. రుణం పొందేందుకు ఉన్న కోళ్లు అమ్మి మేనేజర్‌కు 10 శాతం కమీషన్ కూడా ఇచ్చాడు. తీరా చూస్తే.. రుణం కూడా మంజూరు చేయలేదు. ఇక లోన్ రాదని నిర్ణయానికి వచ్చిన తర్వాత అన్నదాతకు చిర్రెత్తింది. మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలంటూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. నాటు కోళ్ల కోసం రూ.39,000 ఖర్చు చేసినట్లు బిల్లులు కూడా చూపించాడు. తన డబ్బు తిరిగి ఇచ్చేలా.. న్యాయం చేయాలని కోరాడు. డబ్బులు ఇవ్వకపోతే బ్యాంకు ముందు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. రైతు ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

ఇది కూడా చదవండి: Manchu Family: మంచు ఫ్యామిలీ ‘డ్రామా’.. మనోజ్ ఫిర్యాదులో ట్విస్ట్!