Site icon NTV Telugu

Exam Paper: ఎగ్జామ్ పేపర్‌లో ‘ముస్లింలపై దారుణాలు’’ అనే ప్రశ్న.. ప్రొఫెసర్ సస్పెండ్

Delhiuniversity

Delhiuniversity

దేశ రాజధాని ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రశ్నాపత్రం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల జరిగిన సెమిస్టర్ పరీక్షలో అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తీవ్ర ఆగ్రహావేశాలు రగిలించింది. దీంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు. వివాదానికి కారకుడైన ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Robert Vadra: ఏదొక రోజు ప్రియాంకాగాంధీ ప్రధాని అవుతుంది.. రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు

ఈ వారం ప్రారంభంలో యూనివర్సిటీ పరిధిలో మొదటి సెమిస్టర్ పరీక్ష జరిగింది. బీఏ సోషల్ ప్రశ్నాపత్రంలో ‘భారతదేశంలో సామాజిక సమస్యలు’ అనే పేపర్‌లో 15 మార్కుల ప్రశ్న దుమారం రేపింది. ‘భారతదేశంలో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దారుణాలను వివరించండి.’ అంటూ ప్రశ్న వచ్చింది. దీంతో విద్యార్థులు అవాక్కయ్యారు. ఈ ప్రశ్నను ప్రొఫెసర్ వీరేంద్ర బాలాజీ షహరే రూపొందించారు. అయితే ఈ ప్రశ్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అప్రమత్తం అయింది. దీనిపై విచారణ కమిటీ వేసింది. అంతేకాకుండా కమిటీ నివేదిక ఇచ్చేంత వరకు ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రొఫెసర్‌పై ఎఫ్‌ఐఆర్ బుక్ చేసే ఉద్దేశం లేదని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.

 

Exit mobile version