Coal Smugling Scam: మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ‘బొగ్గు అక్రమాస్తుల కుంభకోణం’పై విచారణకు రావాలని సమన్లు జారీ చేసినట్లు ఒక అధికారి తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని కోల్‌కతా కార్యాలయంలో శుక్రవారం ఉదయం విచారణకు హాజరు కావాలని ఈడీ కోరినట్లు ఆయన తెలిపారు. “అధికారుల ముందు హాజరుకావాలని అభిషేక్ బెనర్జీకి సమన్లు పంపాము. అతనిని విచారించడానికి న్యూఢిల్లీ నుంచి అధికారులు వస్తారు” అని సీనియర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారి వెల్లడించారు.
NCRB: దేశంలో మహిళలకు రక్షణ లేని నగరాలు ఇవే.. ప్రతీరోజూ ఇద్దరు బాలికలపై అత్యాచారాలు..?
గతంలో ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ దీనిపై స్పందించారు. బీజేపీపై ఆరోపణలు చేస్తూ… తన మేనల్లుడు, పార్టీలో రెండో స్థానంలో ఉన్న అభిషేక్, ఇతర సీనియర్ నాయకులకు కేంద్ర ఏజెన్సీలు నోటీసులు పంపవచ్చని మమత గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం అభిషేక్ బెనర్జీ ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
