Site icon NTV Telugu

యూపీ పోల్‌: కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థిగా ప్రియాంక గాంధీ..? ఇలా క్లారిటీ

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆస‌క్తిక ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి.. అన్నీ తానై ముందుడి యూపీ కాంగ్రెస్ బాధ్య‌త‌ల‌ను భుజాన‌వేసుకుని ముందుకు వెళ్తున్నారు ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, యూపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా.. ఇప్ప‌టికే బీజేపీ, ఎస్పీ సీఎం అభ్య‌ర్థులు తేలిపోవ‌డంతో.. కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి ఎవ‌రు అనేది ప్ర‌శ్న‌గా మారింది.. ఈ వ్య‌వ‌హారం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ‌ర‌కు చేరింది.. ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసిన స‌మ‌యంలో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరు అని మీడియా ప్ర‌తినిధులు ఆమెను ప్ర‌శ్నించ‌గా.. ” మీకు ఇంకెవరైనా కనిపిస్తున్నారా ?. మీరు నన్నే ఎందుకు అనుకోకూడదు..?” అని స‌మాధానం ఇచ్చారు ప్రియాంక‌.. ఆ వెంట‌నే తాను ఎన్నికల్లో పోటీచేసే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పారు.. కానీ, ఇక కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి ప్రియాంకనే అంటూ జోరుగా ప్ర‌చారం సాగుతోంది..

Read Also: భార‌త్‌లో త‌గ్గిన క‌రోనా.. అయినా భారీగానే..

ఈ విష‌యంపై మ‌రోసారి జాతీయ మీడియా ప్రియాంక గాంధీ వాద్రాను సంప్ర‌దించింది.. దీంతో.. దానిపై మ‌రింత క్లారిటీ ఇచ్చారామె.. తాను సీఎం ఫేస్ వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టిన ఆమె.. అది “అతిశయోక్తిగా” కామెంట్ చేశారు.. నేనే సీఎం అభ్య‌ర్థిని అని చెప్ప‌డంలేదు.. మీరందరూ మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి.. చికాకుతో చెప్పిన మాట అది అని క్లారిటీ ఇచ్చారు.. ఇక‌, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మినహా ఏ పార్టీతోనైనా ఎన్నికల తర్వాత పొత్తుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు ప్రియాంక గాంధీ.. ఇదే స‌మ‌యంలో మాయావ‌తిని టార్గెట్ చేసిన ఆమె.. యూపీ ఎన్నికల్లో మాయావతి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అర్థం కావ‌డంలేద‌ని.. ఆమె వ్య‌వ‌హార శైలితో తాను ఆశ్చర్యపోయాన‌న్నారు.. మ‌రోవైపు సీఎం యోగి వ్యాఖ్య‌లకు కౌంట‌ర్ ఇచ్చిన ప్రియాంక‌.. 80 శాతం వ‌ర్సెస్ 20 శాతం అని సీఎం యోగి చెబుతున్నారు.. నిజం ఏంటంటే.. 99 శాతం వ‌ర్సెస్ 1 శాత‌మే అన్నారు.. ఈ దేశంలో, యూపీతో సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బడా వ్యాపారవేత్తలు, పాల‌కుల‌ స్నేహితులు కొద్దిమంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు, అందరూ చాలా బాధలో ఉన్నారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప్రియాంక గాంధీ.

Exit mobile version