Site icon NTV Telugu

Covid-19: నిన్న సోనియాకు.. నేడు ప్రియాంక గాంధీకి..!!

Priyanka Gandhi

Priyanka Gandhi

కరోనా మహమ్మారి మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. దేశంలో మరోసారి కరోనా కేసులు నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఒక్క రోజు వ్యవధిలోనే ఆమె కుమార్తె ప్రియాంకాగాంధీ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. తాను కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు.

Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. త్వరలో పీఎంశ్రీ స్కూల్స్

కాగా ప్రస్తుతం తాను కరోనా ప్రొటోకాల్స్ అన్నీ పాటిస్తున్నానని ప్రియాంక గాంధీ తెలిపారు. తాను హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానని.. తనతో ఇటీవల కాంటాక్ట్ అయినవారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. తన తల్లికి కరోనా సోకిందని తెలియగానే గురువారం లక్నోలో ఉన్న ప్రియాంక తన టూర్ రద్దు చేసుకుని ఢిల్లీకి వచ్చేశారు. తన షెడ్యూల్‌ను ఎందుకు అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. అయితే ఇంతలోనే ఆమెకు కరోనా నిర్ధారణ అయ్యింది. కాగా యూపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే క్రమంలో లక్నోలో రెండు రోజుల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.

Exit mobile version